PF Account: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి

PF Balance Check: ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వడ్డీ జమ చేయట్లేదని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2023, 06:37 PM IST
PF Account: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి

PF Balance Check: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్‌ అకౌంట్లలో వడ్డీ జమ చేసినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ చేయడం నిరంతర ప్రక్రియ అని అన్నారు. కొత్త సాఫ్ట్ వేర్ అమలులోకి వచ్చిన తర్వాత నిర్దేశిత పద్ధతిలో వడ్డీ జమ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే టీడీఎస్‌కు సంబంధించిన కొత్త నిబంధనల కారణంగా పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ ప్రక్రియ నెమ్మదిగా ఉందని ఆయన చెప్పారు.

ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. యజమాని తరపున కూడా అంతే మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యజమాని వాటా నుంచి నిర్ణీత మొత్తం ఈపీఎస్ ఖాతాకు వెళుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీని ఉద్యోగుల భవిష్య నిధితో అనుసంధానమైన ఉద్యోగుల ఖాతాలలో జమ చేయలేదనే ప్రచారం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు ప్రతిపక్ష ఎంపీలు, ఉద్యోగుల సంఘాలు చాలా కాలంగా గళం విప్పాయి. ఈ విషయంపై తాజాగా లోక్‌సభలో కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి క్లారిటీ ఇచ్చారు.

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 98 శాతం మంది ఖాతాదారుల అకౌంట్లలో ప్రభుత్వం వడ్డీ ఖాతాల్లో జమ చేసింది. వడ్డీ డబ్బు మీ పీఎఫ్‌ ఖాతాలో జమ అయిందో లేదో లేదో త్వరలో చెక్ చేసుకోండి. ముందుగా ఈపీఎఫ్‌ఓ ​​పోర్టల్ www.epfindia.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి . ఇక్కడ E-PassBook ఆప్షన్‌పై క్లిక్ చేయండి. కొత్త పేజీలో యూఎఎన్‌పై క్లిక్ చేసి పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్‌ను నమోదు చేసిన తరువాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత.. మెంబర్ ఐడీ ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీరు పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో పాస్‌బుక్ పొందుతారు. ఇందులో ఇటీవల వచ్చిన వడ్డీ తదితర మొత్తాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ ఖాతా పాస్‌బుక్ అప్‌డేట్ కాకపోతే అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతున్నాయనే ప్రచారానికి కూడా చెక్ పెట్టారు కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి. ఈపీఎఫ్‌ మెంబర్ పాస్‌బుక్ అప్‌డేట్ అనేది కేవలం ఎంట్రీ ప్రాసెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయకపోయినా.. ఈపీఎఫ్‌ సభ్యులకు ఎటువంటి ఆర్థిక నష్టం జరగదని చెప్పారు. లోక్‌సభలో ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 

Also Read: Helicopter Crash: కూప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. పైలట్ల కోసం సెర్చ్ ఆపరేషన్  

Also Read: AP Budget 2023: రూ.2,79,279 కోట్లతో ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇలా..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News