7th Pay Commission: డీఏ పెంపు తరువాత కేంద్రం మరో ప్రకటన.. హెచ్ఆర్ఏ పెంపు ఎప్పుడంటే..?
7th Pay Commission HRA Hike: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత ఇటీవల డీఏ పెంపు ప్రకటనతో తెగ సంబరపడిపోతున్నారు. తాజాగా వారికి మరో గుడ్‌న్యూస్ అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వివరాలు ఇలా..
7th Pay Commission HRA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త రానుంది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచిన తర్వాతే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ కూడా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల డీఏను నాలుగు శాతం పెంచిన విషయం తెలిసిందే. గతంలో 38 శాతం ఉండగా.. అది ప్రస్తుతం 42 శాతానికి చేరింది. అదేవిధంగా ప్రభుత్వం ఇంటి అద్దె భత్యాన్ని కూడా పెంచబోతోంది. హెచ్ఆర్ఏ గురించి ప్రభుత్వం త్వరలో ప్రకటించబోతోంది.
త్వరలో హెచ్‌ఆర్‌ఏ పెంపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి.. హెచ్ఆర్ఏ పెంచే అవకాశం ఉంది. డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతం స్థాయికి చేరుకుంటే.. ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏను సవరించవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 42 శాతంగా ఉంది. జూలై 2021లో కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 25 శాతం దాటిన తర్వాత ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏను సవరించింది. ఆ తరువాత మళ్లీ మార్చలేదు. డీఏ 50 శాతానికి చేరుకున్న తరువాత హెచ్ఆర్ఏలో మార్పులు చేయనుంది.
ఈసారి ప్రభుత్వం ఇంటి అద్దె భత్యాన్ని 3 శాతం పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగులకు 27 శాతం హెచ్‌ఆర్‌ఏ లభిస్తుండగా.. అది 30 శాతానికి పెరగనుంది. ఉద్యోగుల డీఏ 50 శాతానికి చేరితే.. హెచ్ఆర్ఏ 30 శాతం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇటీవలె కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు చెక్ పెడుతూ నాలుగు శాతం డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నిర్ణయంతో కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. పెరిగిన డీఏ జనవరి 1వ తేదీ నుంచి వర్తించనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంపు నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.12,815.60 కోట్ల భారం పడనుంది. ఉద్యోగుల ఖాతాలో ఒకేసారి భారీగా నగదు జమకానుంది.
Also Read: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్ ప్రకటన.. పాండ్యా, జడేజాకు ప్రమోషన్.. ఈ ప్లేయర్లు ఔట్..!
Also Read: Aha New CEO: ఆహా కీలక నిర్ణయం.. కొత్త సీఈఓ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి