7th Pay Commission DA Hike News: లోక్‌సభ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ప్రకటనకు ముందే కేంద్రం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ రానుంది. వచ్చే నెలలో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు ప్రకటన ఉండనుంది. మార్చిలో 4 శాతం డీఏ పెంచే అవకాశం కనిపిస్తోంది. ఈ పెంపు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. జనవరి నుంచి మార్చి వరకు డియర్‌నెస్ అలవెన్స్ బకాయిగా చెల్లిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) ఇస్తారు. డీఏ, డీఆర్ ఏడాదికి రెండుసార్లు పెంచుతున్న విషయం తెలిసిందే. మొదటి డీఏ జనవరి 1 నుంచి.. రెండో డీఏ జూలై 1 నుంచి అమలు చేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IND vs ENG Highlights: ఇంగ్లాండ్‌ను మడతబెట్టిన భారత్.. నాలుగో టెస్టులో సూపర్ విక్టరీ.. సిరీస్‌ మనదే..!    


గతేడాది 38 శాతం డీఏ ఉండగా.. కేంద్ర ప్రభుత్వం రెండు 4 శాతం చొప్పున పెంచడంతో 46 శాతానికి చేరింది. మరోసారి 4 శాతం పెంచే అవకాశం ఉండడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరనుంది. పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) 12 నెలలకు సగటున 392.83గా ఉంది. అంటే బేస్ పేలో డీఏ 50.26 శాతానికి చేరింది. 


డీఏ శాతం ఇలా..


==> డియర్‌నెస్ అలవెన్స్ శాతం = ((AICPI సగటు (బేస్ ఇయర్ 2001=100) గత 12 నెలలు -115.76)/115.76)*100 


ఈ రాష్ట్రాల్లో డీఏ పెంపు


రోడ్ బేస్ కార్మికులకు యూపీ సర్కారు ఇటీవల శుభవార్త చెప్పింది. ఈ నెల ప్రారంభంలో 10 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను మంజూరు చేసింది. దీంతో రోడ్‌వేస్ ఉద్యోగులకు మొత్తం 38 శాతానికి చేరుకుంది. యోగీ ప్రభుత్వ నిర్ణయంతో 12 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. పశ్చిమ బెంగాల్ సర్కారు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ 4 శాతం పెంచింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గతేడాది డిసెంబర్‌లో డీఏ పెంపు ప్రకటన చేశారు. డిసెంబర్ 1 నుంచి అమలులోకి చేస్తూ.. డీఏను 34 శాతం నుంచి 38 శాతానికి పెంచారు. పంజాబ్‌లో 3.25 లక్షల మంది ఉద్యోగులు, 3.50 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం చేకూరింది.


Also Read: Ashish Wedding Reception: హీరో ఆశీష్‌ జంటను ఆశీర్వదించిన చెర్రీ, విజయ్, నాగ్‌, నమ్రత, ఇతర ప్రముఖులు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter