IND vs ENG Highlights: ఇంగ్లాండ్‌ను మడతబెట్టిన భారత్.. నాలుగో టెస్టులో సూపర్ విక్టరీ.. సిరీస్‌ మనదే..!

India Vs England 4th Test Match Full Highlights: నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లిష్ బౌలర్లు భయపెట్టినా.. బ్యాట్స్‌మెన్ అద్భుతంగా పోరాడి విజయ తీరాలకు చేర్చారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Feb 26, 2024, 03:25 PM IST
IND vs ENG Highlights: ఇంగ్లాండ్‌ను మడతబెట్టిన భారత్.. నాలుగో టెస్టులో సూపర్ విక్టరీ.. సిరీస్‌ మనదే..!

India Vs England 4th Test Match Full Highlights: తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. అద్భుతంగా పుంజుకుని సిరీస్ సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్‌లో సిరీస్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 3-1 తేడాతో భారత్ వశమైంది. నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీకి తోడు శుభ్‌మన్ గిల్, ధ్రువ్‌ జురెల్ అద్భుత పోరాటంతో జట్టును గెలిపించారు. బజ్‌బాల్ ఆట అంటూ హైప్ క్రియేట్ చేసిన ఇంగ్లిష్ జట్టును రోహిత్ సేన అదే వ్యహంతో మడతపెట్టడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్సింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌట్ అయింది. బదులుగా టీమిండియా 307 రన్స్ చేసింది. అనంతరం ఇంగ్లాండో రెండో ఇన్సింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్సింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకుని టీమిండియా ముందు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. మ్యాచ్‌ విజయంతోపాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.

Also Read: Samantha@14 Years: సినీ ఇండస్ట్రీలో 14 యేళ్లు కంప్లీట్ చేసుకున్న సమంత.. ఫ్యాన్స్ సంబరాలు..

నాలుగో రోజు ఆటను 40/0 స్కోరుతో ప్రారంభించిన భారత్.. ఆరంభంలో మెరుగ్గానే ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (55), యశస్వి జైస్వాల్ (37) తొలి వికెట్‌లకు 84 పరుగులు జోడించడంతో సులభంగా గెలుస్తుందనిపించింది. అయితే అండర్సన్ పట్టిన సూపర్ క్యాచ్‌తో జైస్వాల్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోహిత్ శర్మ, రజత్ పటిదార్ (0), రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్ ఖాన్‌ (0) తక్కువ స్కోరు వెనుదిరగడంతో ఇంగ్లాండ్ రేసులోకి వచ్చింది. ఈ సమయంలో గిల్-జురెల్ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. 

గిల్ ఓ ఎండ్‌లో పాతుకుపోగా.. మరో ఎండ్‌లో జురెల్ చక్కటి సహకారం అందించాడు. సింగిల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మెల్లిగా స్కోరు బోర్డును కరిగించారు. ఇంగ్లాండ్ స్పిన్నర్లు ఆటాకింగ్ చేసినా.. ఏ మాత్రం తడపడకుండా లక్ష్యం వైపు నడిపించారు. ఇద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించారు. చివర్లో గిల్ (52) ఒకే ఓవర్లో రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జురెల్ (39 నాటౌట్) విన్నింగ్ షాట్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు తీయగా.. హార్ట్లీ, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. రెండు ఇన్నింగ్స్‌లో రాణించిన జురెల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. చివరి టెస్టు ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది.

Also Read: Jr NTR - Devara: 'దేవర' మూవీపై కీలక అప్‌డేట్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News