7th Pay Commission Pension Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. పెన్షన్‌దారుల సంక్షేమ శాఖ ద్వారా కొత్త రూల్స్ జారీ అయ్యాయి. పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడం గురించి ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ఇక నుంచి పెన్షన్‌ను ఒక్కసారి మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ నియమాలపై ఓ లుక్కేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెన్షన్‌దారుల సంక్షేమ శాఖ (DoPPW) నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఎవరైనా ఉద్యోగి తన ప్రాథమిక జీతంలో కొంత భాగాన్ని ఉపసంహరించుకుంటే.. అతను మళ్లీ పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ (కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్) రూల్స్-1981 ప్రకారం.. ప్రభుత్వం ఒకటి కంటే ఎక్కువసార్లు పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి లేదు. దీంతో మొత్తం పెన్షన్‌లో 40 శాతం మాత్రమే ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. 


ఏకమొత్తం ఉపసంహరణపై ఒకేసారి 40 శాతం మొత్తాన్ని మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇది కాకుండా ఉద్యోగికి సంబంధించి పెన్షన్ సవరిస్తే.. బకాయిలను ఉపసంహరించుకోవచ్చు. ప్రభుత్వం ఇక్కడ 40 శాతం నిబంధనను అమలు చేసినా.. జనవరి 1, 2016, ఆగస్టు 4, 2016 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, CCS రూల్ 10 ప్రకారం పెన్షన్ రివిజన్‌పై అదనపు మినహాయింపు పొందుతారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ నిబంధనలను నియమాలు ఇప్పటి నుంచే వర్తించనున్నాయి.


Also Read: Ys Sharmila: థ్యాంక్యూ మోదీ జీ.. ప్రధాని ఫోన్ కాల్‌పై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..  


Also Read: Rain Alert For AP: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి