Ys Sharmila: థ్యాంక్యూ మోదీ జీ.. ప్రధాని ఫోన్ కాల్‌పై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..

Ys Sharmila thanked to PM Narendra Modi: డా బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను ఆమె కొనియాడారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2022, 01:35 PM IST
  • అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ షర్మిల నివాళులు
  • రాజ్యాంగాన్ని మార్చాలని అంబేద్కర్‌ను కేసీఆర్ అవమానించారు
  • తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది
Ys Sharmila: థ్యాంక్యూ మోదీ జీ.. ప్రధాని ఫోన్ కాల్‌పై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..

Ys Sharmila thanked to PM Narendra Modi: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాన మంత్రి మోదీ ఫోన్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో అరెస్ట్ వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది. ఆమెపై జరిగిన దాడి పట్ల ఆయన సానూభూతి వ్యక్తం చేసినట్లు సమాచారం. దాదాపు పది నిమిషాల పాటు షర్మిలతో మాట్లాడిన ప్రధాని.. అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఈ విషయంపై మీడియాతో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ చేసినందుకు ప్రధాని మోదీకి థ్యాంక్యూ చెప్పారు. 

డా బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.  అంబేద్కర్ దేశానికి చేసిన సేవాలను ఆమె కొనియాడారు.అస్ప్రుశ్యత అనే భయంకరమైన వ్యాధిని రూపమాపడంలో అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేడ్కర్‌కు  కేసీఆర్ ఇచ్చిన గౌరవం ఎంత..? ఆయ విగ్రహం పెడతామన్నారు విస్మరించారని మండిపడ్డారు. మన రాష్ట్రంలో నేటికీ ఎస్సీలకు అన్యాయం జరుగుతూనే  ఉందని.. కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పని చేస్తున్నామని అంటున్నారు తప్ప ఎక్కడా అది కనిపించడం లేదన్నారు.

'రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేడ్కర్ గారి పేరు పెడితే కేసీఆర్ గారు దాని పేరు తీసేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా తన కమీషన్ల కోసం రీడిజైన్ చేశారు. రాష్ట్రంలో 18-20 లక్షల దళిత కుటుంబాలుంటే కనీసం వారిలో 10 శాతం మందికి కూడా దళిత బంధు ఇవ్వలేదు. ఇలా ప్రతి ఒక్క విషయంలో దళితులను మోసం చేశారు. దళితులు కేసీఆర్‌కు ఓటు బ్యాంకుగా పనికొస్తారు తప్ప కనీసం పక్కన కూడా పెట్టుకోరు. రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడి అంబేడ్కర్ గారిని ఘోరంగా అవమానించారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలని కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నాం.
 
తెలంగాణలో అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అవడం లేదు. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది. కే అంటే కొట్టి.. సీ అంటే చంపి.. ఆర్ అంటే రాజ్యాంగం. భారత దేశంలో అంతా అంబేడ్కర్ గారి రాజ్యాగం అమలవుతుంటే తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది. కేసీఆర్ గారి రాజ్యాంగంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అన్నది లేదు. తెలంగాణలో ఒక డిక్టేటర్ షిప్ నడుస్తుంది. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు..' అని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.

ప్రధాని మోదీ ఫోన్ చేసిన విషయంపై ఆమె స్పందిస్తూ.. థ్యాంక్యూ మోదీ జీ.. ఒక మోదీ మాత్రమే కాదు ఎంతో మంది స్పందించారని చెప్పారు. ఒక ఆడబిడ్డ ప్రజల కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకోవడం, ఇలా అరెస్ట్ చేయడం అన్యాయమని చాలా మంది సానుభూతి వ్యక్తం చేశారని అన్నారు. స్పందించకుండా కూడా బాధపడ్డ వారు ఎంతోమంది ఉన్నారని అన్నారు. అందరికీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కృతజ్ఞతలు తెలుపుకుంటోందని షర్మిల తెలిపారు.

Also Read: Rain Alert For AP: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు  

Also Read: LIC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x