DH Hike by 4% from 1st July 2023 for Central Government Employees: కేంద్ర కార్మిక శాఖ రూపొందించే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ప్రతి యేటా రెండుసార్లు జనవరి, జూలై నెలల్లో డీఏ పెంచుతుంటారు. ఇప్పుడు ఉద్యోగులు నిరీక్షించేది వచ్చే నెల అంటే జూలై నుంచి పెరగనున్న డీఏ గురించి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కరవు భృత్యం పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7వ వేతన సంఘం ప్రకారం క్రమం తప్పకుండా ఓ నెల లేదా రెండు నెలలూ అటూ ఇటైనా కరవు భత్యం పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కచ్చితంగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా ఎరియర్లతో కలిసి అందుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 42 శాతం డీఏ అందుతోంది. ఇప్పుడు జూలై నెలలో పెంచే డీఏ గురించి ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఉద్యోగుల డీఏ, డీఆర్ పెంచే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒడిశా, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు ఇటీవలే ఉద్యోగుల డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.


Also Read: Oneplus 12 Launch Date: ఊహించని ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Oneplus 12..ఏ స్మార్ట్‌ ఫోన్‌ దీనిపైకి పనికిరాదు!


ఇటీవలే ఒడిశా ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో  ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ ఇప్పుడు 42 శాతానికి చేరుకుంది. మొన్నటి వరకూ ఇది 39 శాతముండేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏకంగా 7.5 లక్షలమందికి ప్రయోజనం కలగనుంది. మరోవైపు తమిళనాడు, హర్యానా ప్రభుత్వాలు కూడా డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల కరువు భత్యంను 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసకున్నాయి. కాగా 2023 జనవరి 1 నుంచి కనీస వేతనంలో 38 శాతం నుంచి 42 శాతానికి డీఏ పెంచారు.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు జూలై డీఏ పెంపు కోసం నిరీక్షిస్తున్నారు. ఈసారి డీఏ పెంపు 3-4 శాతం ఉండవచ్చని అంచనా ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 42 శాతం వస్తోంది. ఇప్పుడు జూలైలో మరోసారి పెరిగితే మొత్తం డీఏ 45-46కు చేరవచ్చు. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన తరువాత పోటీగా రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి. లేకపోతే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ప్రారంభమౌతోంది. 


Also Read: 7th Pay Commission: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏ పెంపు ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి