Goa Politics:  రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుండగానే కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గోవాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, అసెంబ్లీలో ఆ పార్టీ ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 8 మంది బీజేపీ లో చేరారు. దీంతో గోవాలో కాంగ్రెస్ బలం మూడుకు పడిపోయింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేష్ ఫాల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలీక్సో సిక్వేరా , రుడాల్ఫ్ ఫెర్నాండెజ్‌సు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. 8 మంది ఎమ్మెల్యేలు ఒక గ్రూపుగా విడిపోతే పార్టీ బలంలో మూడింట రెండొంతుల మెజార్టీ రానుంది. దీంతో ఫిరాయింపు చట్టం వర్తించదు. గత జులైలోనే ఈదిగంబర్ కామత్‌, మైఖేల్ లోబోలు బీజేపీలో చేరనున్నారనే ప్రచారం సాగింది. అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ స్పీకర్‌ను కోరింది. దీంతో ఈసారి అలాంటి అవకాశం లేకుండా ఏకంగా ఎనిమిది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరిపోయారు.


Read also: Munugode Bypoll: కేటీఆర్, హరీష్ రావు గ్రాఫ్ తగ్గిందా? మునుగోడులో ఒక్కో మండలానికే ఇంచార్జ్ బాధ్యతలు..


Read also: Bhatti With KCR: అసెంబ్లీలో సీఎల్పీ నేతకు సీఎం ప్రశంసలు.. రేవంత్ రెడ్డిని తొక్కేయడమే కేసీఆర్ లక్ష్యమా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook