Bihar man vaccine news: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ (Covid Vaccination in India) ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా ప్రజలు రెండు డోసులు తీసుకోగా...80 శాతం మంది మొద‌టి డోసు తీసుకున్నారు. చాలా చోట్ల ఇంకా కొంతమంది టీకా తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో..బీహార్ (bihrar) కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 11 సార్లు వ్యాక్సిన్ తీసుకుని...12వ సారి టీకా వేయించుకోవడానికి రెడీ అయిపోయాడు. అతడే మాధేపుర జిల్లాకు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు బ్రహ్మదేవ్‌ మండల్‌ (Brahmadev Mandal). 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే...


బీహార్‌లోని మాధేపుర జిల్లాలోని ఉద‌కిష‌న్‌గంజ్ డివిజ‌న్‌లోని ఒరాయ్ గ్రామానికి చెందిన 84 ఏళ్ల బ్ర‌హ్మ‌దేవ్ మండ‌ల్ 13 ఫిబ్రవరి, 2021న  మొద‌టి డోస్ (First Dose) తీసుకున్నాడ‌ట‌. అప్పటి నుంచి డిసెంబరు 2021 వరకు 11 డోసులు పొందారు. 12వ డోసు తీసుకునేందుకు చౌసా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లానని..అయితే అక్కడ టీకాల కార్యక్రమం ముగియడంతో 12వ డోసు పొందలేకపోయానని అతడు విచారం వ్యక్తం చేశారు. 


Also Read: Mumbai Covid cases: ముంబైలో కోవిడ్ బీభత్సం.. థర్డ్‌ వేవ్‌కు రెడీ.. లాక్‌డౌన్‌ విధిస్తాం..


11 డోసులు తీసుకున్నా త‌న ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాలేద‌ని ఆయన తెలిపారు. తను వ్యాక్సిన్ (Vaccine) ఎప్పుడెప్పుడు వేయించుకున్నది అతడు రాసిపెట్టుకోవడం విశేషం. ఒక‌టి, రెండు డోసులు తీసుకోవ‌డానికే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్న స‌మ‌యంలో బ్ర‌హ్మ‌దేవ్ ఏకంగా 11 డోసులు టీకా తీసుకోవ‌డం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook