భారత సైనికుల ( Indian Army ) మొబైళ్లలో ఇకపై పేస్ బుక్ ( Facebook ) , ఇన్ స్టాగ్రామ్ ( Instagram ) వంటి యాప్ లు కన్పించకూడదు. ఇండియన్ ఆర్మీ విధించిన ఆ డెడ్ లైన్ లోగా యాప్ లను తొలగించుకోవల్సి ఉంటుంది. లేకపోతే క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. సమాచార భద్రతా ఉల్లంఘన, హనీట్రాప్ వంటి ఘటనల నేపధ్యంలో ఇండియన్ ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇండో చైనా సరిహద్దు ( Indo china border ) ఉద్రిక్తత నేపధ్యంలో టిక్ టాక్ ( TikTok ) , షేర్ ఇట్, హెలో సహా మొత్తం 59 చైనా దేశపు యాప్ ( China Apps ) లను భారతదేశం నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిికి మరో 30 యాప్ లను కలిపి మొత్తం 89 యాప్ లను మొబైళ్ల నుంచి తొలగించాల్సిందిగా ఆర్మీ ...సైనికులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి జూలై 15 వ తేదీని డెడ్ లైన్ గా విధించారు. గడువులోగా నిర్దేశించిన యాప్ లను  తొలగించకపోతే కఠిన చర్యలుంటాయని సైతం హెచ్చరించింది. పాకిస్తాన్, చైనా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆన్ లైన్ లో సైనికుల్ని లక్ష్యంగా ఎంచుకున్న నేపధ్యంలోనూ, సమాచార భద్రత ఉల్లంఘన, హనీట్రాప్ ( Honeytrap ) ఘటనల కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఇండియన్ ఆర్మీ. Also read: CBSE: వచ్చేవారమే సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు


వీటిలో ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి యాప్ లతో పాటు స్నాప్ చాట్, డైలీ హంట్, న్యూస్ డాగ్, ఐఎంవో, ట్రూ కాలర్ వంటివి ఉన్నాయి. గత యేడాదే అధికారిక సమాచారం కోసం వాట్సప్ సైతం వినియోగించవద్దని సూచించిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్ డీఎస్పీగా పనిచేసిన దేవేందర్ సింగ్ వ్యవహారం కూడా ఆర్మీ ఈ నిర్ణయానికి కారణంగా ఉంది. దేవేందర్ సింహ్ టెర్రరిస్టులకు సహాయం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..