India vaccination: దేశంలో కరోమా మహమ్మారి విజృంభణతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది (Corona vaccination in India) ప్రభుత్వం. దీనితో ఇప్పటి వరకు అర్హులైన వయోజనుల్లో 95 శాతం మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం (Vaccination count in India) ప్రకటించింది. ఇక అర్హులైన వయోజనుల్లో 74 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకున్నారని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా ఇప్పటి వరరకు 164.35 కోట్ల వ్యాక్సిన్​ డోసులు పంపిణీ (Total Vaccination in India) చేసినట్లు వివరిచింది వైద్య, ఆరోగ్య శాఖ.


గురువారం రాత్రి ఏడా గంటల వరకు ఒక్క రోజులోనే 49,69,805 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,03,04,847 ప్రికాషన్ డోసులు పంపిణీ చేసినట్లు (Corona booster dose in india) వివరించింది. హెల్త్​కేర్​, ఫ్రంట్​లైన్ వర్కర్లతో పాటు 60 ఏళ్లుపైబడిన వారికి ప్రస్తుతం ప్రికాషన్ డోసు టీకా ఇస్తున్న విషయం తెలిసిందే.


ఈ నెల 3 నుంచి 18-18 ఏళ్ల వయసున్న వారికి టీకా కార్యక్రమం ప్రారంభించగా.. ఇప్పటి వరకు 4,42,81,254 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ (Children vaccination india) వెల్లడించింది.


టీకా కార్యక్రమం శరవేగంగా దూసుకుపోతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ఆరోగ్య సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమవుతుందని (Mansukh mandaviya on Corona vaccination) పేర్కొన్నారు.


దేశంలో వ్యాక్సినేషన్ ఇలా..


దేశంలో 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశలో హెల్త్​కేర్​ వర్కర్లుకు మాత్రమే టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత వృద్ధులకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి టీకాలు ఇవ్వడం ప్రారభించారు. అలా దశల వారీగా.. 18 ఏళ్లు దాటిన వారికి.. తాజాగా 15 ఏళ్లు నిండిన వారికి టీకా ప్రక్రియ ప్రారంభించింది (Corona vaccination updates) ప్రభుత్వం.


Also read: Wine in supermarkets: ఇక సూపర్​ మార్కెట్లలో వైన్​ విక్రయాలు- మంత్రి మండలి ఆమోదం!


Also read: Tamilnadu: తమిళనాడులో కోవిడ్ ఆంక్షల సడలింపు.. నైట్ కర్ఫ్యూ, సండే లాక్‌డౌన్ ఎత్తివేత...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook