Cocaine: ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా..ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా డ్రగ్స్ దందా విచ్చలవిడిగా జరుగుతూనే ఉంది. మత్తు పదార్ధాల్ని అక్రమంగా తరలిస్తున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో పట్టుబడిన వ్యవహారం ఆశ్చర్యపరుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొట్ట విప్పిచూడు..పురుగులే ఉంటాయి కాదిప్పుడు. పొట్ట విప్పి చూస్తే మత్తు పదార్ధాలు బయటపడతాయి. ఆశ్చర్యంగా ఉన్నా నిజమిది. బెంగళూరు ఎయిర్ పోర్ట్‌(Bengaluru Airport)లో పట్టుబడిన మత్తు పదార్ధాల అక్రమ రవాణా వ్యవహారమిది. మత్తు పదార్ధాల్ని అక్రమంగా దేశంలో తరలించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అక్రమార్కులు. ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి  దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చి..ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డాడు. విమానంలో ఆహారం, నీరు కూడా తీసుకోకపోవడంతో అనుమానమొచ్చిన అధికారులు బెంగళూరులో స్కాన్ చేయగా..పొట్టలో ఏకంగా 11 కోట్ల విలువైన 1.3 కిలోల కొకైన్ ఉన్నట్టు నిర్ధారణైంది. వైద్యుల సహాయంతో మైనర్ సర్జరీ ద్వారా అంటే పొట్ట కోసి కొకైన్(Cocaine)బయటకు తీశారు. ఈ మత్తు పదార్ధాల్ని ఎవరు పంపించారు, ఎక్కడ్నించి అక్రమ రవాణా జరుగుతోందనే వివరాల్ని సేకరిస్తున్నారు. 


నిందితుడి వయస్సు 30 ఏళ్లని..బెంగళూరులో కిడ్నీ చికిత్స కోసం వస్తున్నట్టుగా వీసా తీసుకున్నాడని డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. కొకైన్ అంతా అతని కడుపులో(Cocaine in Stomache) క్యాప్స్యూల్స్ రూపంలో ఉంది. ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు. గతంలో అంటే ముంబైలో కూడా ఓ వ్యక్తి ఇదే తరహాలో పట్టుబడ్డాడు. తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశానికి చెందిన ఓ వ్యక్తి 10 కోట్ల విలువైన 1.02 కిలోల కొకైన్‌ను ఇలాగే పొట్టులో దాచుకుని తరలిస్తూ పట్టుబడ్డాడు. 


Also read: West Bengal Violence: పశ్చిమ బెంగాల్ హింసపై సీబీఐ విచారణ ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook