Gyanvapi Masjid Video: వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వీడియోలో ఏముందసలు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే అనంతరం వివాదం ఇంకా పెరుగుతోంది. మసీదులోని వుజూ ఖానా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. కేవలం 30 సెకన్లున్న ఈ వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇందులో నంది విగ్రహం కన్పిస్తోంది. వుజూ ఖానాలో శివలింగం లభించిందంటూ హిందూవర్గం వాదించింది. మే 16వ తేదీన జ్ఞానవాపి మసీదు సర్వే పూర్తి చేసుకుని..నివేదిక సిద్ధం చేస్తోంది.


జ్ఞానవాపి మసీదుకు చెందిన వీడియోలో వుజూఖానాకు సరిగ్గా ముందుభాగంలో ఓ నంది విగ్రహం ఉన్నట్టు కన్పిస్తోంది. వుజూఖానాకు, నంది విగ్రహానికి మధ్య ఇనుప కంచె ఒకటి కన్పిస్తోంది. ఇంతకుముందు కూడా వుజూఖానా వీడియో వెలుగులోకి వచ్చినప్పుడు అందులో శివలింగం ఉందనే వాదన వెలుగుచూసింది. ఈ వీడియో జ్ఞానవాపి మసీదుకు చెందిన వుజూఖానా వీడియో అని అసిస్టెట్ కోర్టు కమీషనర్ అజయ్ ప్రతాప్ సింహ్ తెలిపారు. అయితే ఈ వీడియో ఎప్పటిదనే విషయం మాత్రం తెలియలేదు. దాని గురించి తనకు తెలియదని చెప్పారు.



జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో వారణాసి జిల్లా కోర్టులో ఇవాళ 2 పిటీషన్లపై విచారణ జరుగుతుందా లేదా అనేది వారణాసి బార్ అసోసియేషన్ మధ్యాహ్నం నిర్వహించే సమావేశంలో నిర్ణయం కానుంది. కోర్టు న్యాయవాదులు ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు. విచారణకు అనుమతిస్తూ హిందూపక్షాలు బార్ అసోసియేషన్‌కు లేఖ రాశాయి.


జ్ఞానవాపి శృంగేరీ గౌరీ పరిసరాల్లో సర్వే సందర్భంగా శివలింగం లభించిందంటున్న ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాల్సిందిగా వారణాసి జిల్లా అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ముస్లింలు అక్కడ నమాజు చేసుకునేందుకు అనుమతిచ్చింది. శివలింగం లభించిందంటున్న ప్రాంతంలో భద్రత చర్యలు చేపట్టడమే కాకుండా..ముస్లింలు నమాజు చేసుకునేందుకు ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు కోర్టు ఆదేశించింది. 


Also read: Gyanvapi masjid Issue: జ్ఞానవాపి మసీదులో కొత్త వివాదం, అడ్వకేట్ కమీషనర్ అజయ్ మిశ్రా వర్సెస్ విశాల్ సింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook