Gyanvapi masjid Issue: జ్ఞానవాపి మసీదులో కొత్త వివాదం, అడ్వకేట్ కమీషనర్ అజయ్ మిశ్రా వర్సెస్ విశాల్ సింగ్

Gyanvapi masjid Issue: ఉత్తరప్రదేశ్‌లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో సర్వే కమీషనర్ అజయ్ కుమార్ మిశ్రాపై వేటు పడింది. సర్వే బృందం నుంచి అతడిని కోర్టు తప్పించడంలో విశాల్ సింగ్ పాత్ర ఉందా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2022, 07:45 AM IST
  • జ్ఞానవాపి మసీదు వివాదంలో కొత్త మలుపు
  • అడ్వకేట్ కమీషనర్ అజయ్ మిశ్రాని తొలగించి..విశాల్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించిన వారణాసి కోర్టు
  • కోర్టుకు నివేదిక సమర్పించేందుకు మరో రెండ్రోజులు గడువు
Gyanvapi masjid Issue: జ్ఞానవాపి మసీదులో కొత్త వివాదం, అడ్వకేట్ కమీషనర్ అజయ్ మిశ్రా వర్సెస్ విశాల్ సింగ్

Gyanvapi masjid Issue: ఉత్తరప్రదేశ్‌లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో సర్వే కమీషనర్ అజయ్ కుమార్ మిశ్రాపై వేటు పడింది. సర్వే బృందం నుంచి అతడిని కోర్టు తప్పించడంలో విశాల్ సింగ్ పాత్ర ఉందా..

బెనారస్‌లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో వారణాసి ట్రయలో కోర్టు ఆదేశాల మేరకు సర్వే పూర్తయింది. మూడ్రోజులపాటు జరిగిన సర్వే అనంతరం వారణాసి ట్రయల్ కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది. అడ్వేకేట్ కమీషనర్ అజయ్ మిశ్రా నేతృత్వంలో జరిగిన ఈ సర్వేపై ముస్లిం పక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రొసీడింగ్ గోప్యతను ఉల్లంఘించి..సమాచారాన్ని లీక్ చేశారనేది ప్రధాన ఆరోపణ. 

ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. అజయ్ మిశ్రాను సర్వే నుంచి తొలగించింది. స్పెషల్ అడ్వకేట్ కమీషనర్ విశాల్ సింగ్‌ను నియమిచింది. నివేదిక సమర్పించేందుకు విశాల్ సింగ్ మరో రెండ్రోజుల గడువు కోరారు. వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీకు చెందిన ఇద్దరు డ్రాఫ్ట్స్‌మెన్‌ల ద్వారా మ్యాప్ సిద్దం చేస్తున్నట్టు చెప్పారు. అటు కోర్టు కూడా రెండ్రోజులు గడువిచ్చింది. 

అజయ్ మిశ్రా వర్సెస్ విశాల్ సింగ్

అయితే తానేమీ తప్పు చేయలేదని ఇదంతా తాను నమ్మిన విశాల్ సింగ్ వల్లేనని అజయ్ మిశ్రా అంటున్నారు. విశాల్ సింగే నివేదిక లీక్‌కు కారణమని..తాను అతన్ని గుడ్డిగా నమ్మానని చెబుతున్నారు. లీక్ వ్యవహారంపై కోర్టుకు ఫిర్యాదు చేసింది కూడా విశాల్ సింగే కావడం గమనార్హం. అజయ్ మిశ్రా వర్సెస్ విశాల్ సింగ్ వ్యవహారం ఇప్పుడు జ్ఞానవాపి మసీదు వివాదంలో కొత్త మలుపుగా మారుతోంది. 

వాస్తవానికి జ్ఞానవాపి మసీదు ఆవరణలో 13 నుంచి 16 వరకూ సర్వే, ఫోటోగ్రఫీ నిర్వహించి..మే 17న కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ సర్వే సమయంలో అజయ్ మిశ్రా వ్యవహారాన్ని లీక్ చేశారనే ఆరోపణలు రావడంతో అతడిని తొలగించి..విశాల్ సింగ్‌కు ఆ బాధ్యత అప్పగించింది. మరోవైపు జ్ఞానవాపి మసీదు ఆవరణలో శివలింగం కనుగొనబడిందని ఓ వర్గం వాదిస్తుంటే..అది శివలింగం కాదని..ఫౌంటెన్ నిర్మాణలో ఓ భాగమని మరో వర్గం వాదిస్తోంది. 

Also read: Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు అంశంతో తెరపైకి మరో కొత్త వివాదం..ఆ వివరాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News