'కరోనా వైరస్' కారణంగా.. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడే వలస  కార్మికులు చిక్కుకుపోయారు.  ఉపాధి లేక  తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే  స్వస్థలాలకు వెళ్లేందుకు ఏ ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో వలస కార్మికులు కాలినడకనే తిరుగుపయనం కట్టారు. ఐతే వలస  జీవుల  కష్టాలు కడతేర్చేందుకు కేంద్ర  ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసింది.  దీంతో  వారు స్వస్థలాలకు వెళ్లేందుకు కాస్తంత కష్టం తప్పింది.  కానీ శ్రామిక్ రైళ్ల ద్వారా ఇబ్బంది ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదు. 


కేరళ నుంచి రాజస్థాన్ వెళ్తున్న ప్రత్యేక శ్రామిక్ రైలు.. ఇవాళ ( మంగళవారం)  తెల్లవారుజామున 2  గంటలకు పట్టాలు  తప్పింది.  కర్ణాటక  మంగళూరుకు  సమీపంలోని పదిల్ వద్ద  ఈ ఘటన జరిగింది. ఐతే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం కాస్తంత ఊరటనిచ్చే అంశం. పట్టాలు తప్పిన సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉండడంతోనే అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.


[[{"fid":"185782","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈ  ఘటనపై వెంటనే రైల్వే సిబ్బంది  స్పందించారు.  ప్రమాదం జరిగిన తర్వాత మిగతా బోగీలను మరో ఇంజిన్ తో జత చేసి రాజస్థాన్ పంపించారు.  కేరళలోని తిరూర్ నుంచి బయల్దేరిన శ్రామిక్  రైలు రాజస్థాన్ రాజధాని  జైపూర్ వెళ్తుండగా ప్రమాదం  జరిగింది. ప్రస్తుతం రైలు ప్రమాదానికి గురైన స్థలం వద్ద  మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..