ప్రతి అంశానికి ఆధార్ అనుసంధానం తప్పని సరి చేసిన నేపథ్యంలో ఈ అంశం చర్చనీయంగా మారింది. తాజాగా ఈ అంశంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందించారు.  ఆధార్ తో దేశ భద్రతకు ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు. ఆధార్ కు సంబంధించి కోర్ సాఫ్ట్ వేర్ ను ఓ అమెరికన్ కంపెనీ డెవలప్ చేస్తుండటంతో... డేటా సెక్యూరిటీపై అందరిలో అనుమానాలు నెలకొన్నాయని... ఈ సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగాలు తమ స్వార్థ కార్యకలాపాలను వాడుకోవచ్చని స్వామి అభిప్రాయపడ్డారు. ప్రతి అంశానికి ఆధార్ నెంబర్ లింక్ చేయాలనేది సరైన నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై సవివరంగా వివరిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాస్తానని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొబైల్ నెంబర్లకు ఆధార్ లింక్ చేసుకోవాలన్న నిబంధనలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన అత్యున్నత ధర్మాసనం ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. ఇదే సందర్భంలో సుప్రంకోర్టు స్పందిస్తూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు, పలు అంశాలకు ఆధార్ ను లింక్ చేయడంపై పలు పిటిషన్లు వచ్చాయని, వీటిని త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని పేర్కొంది. ఈ నేఫథ్యంలో సుబ్రమణ్య స్వామి తన అభిప్రాయాలను వెల్లడించారు.