Aadhar Download: భారతదేశంలో వివిధ సేవలను పొందేందుకు ఆధార్ కార్డ్ అత్యంత కీలకమైన పత్రాలలో ఒకటి. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలు తమ సేవలను అందించడానికి ఆధార్ కార్డ్ హార్డ్ కాపీని కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆధార్ కార్డు పొగొట్టుకుంటున్న వారూ ఉన్నారు. అలా ఆధార్ కార్డు పొరపాటున మిస్ చేసుకున్న వారు ఇప్పుడు సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అది కూడా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండానే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొబైల్ నంబర్ లేకుండా ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలంటే..


1) ముందుగా ఆధార్ కార్డును జారీ చేసే అధికారిక UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లండి.


2) ఆ వెబ్ సైట్ లో 'మై ఆధార్' ఆప్షన్ ను ఎంచుకోవాలి. 


3) 'ఆర్డర్ ఆధార్ రీప్రింట్' ఎంపికపై క్లిక్ చేయాలి.


4) ఆ తర్వాత మీ ఆధార్ నంబరు (12 అంకెలు)ను సైట్ లో నమోదు చేయాలి. దీనికి బదులుగా మీ ఆధార్ కార్డుకు సంబంధించిన వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VID) ను కూడా ఎంటర్ చేయవచ్చు. 


5) ఆ వెంటనే స్క్రీన్‌పై చూపిన సెక్యూరిటీ లేదా క్యాప్చా కోడ్‌ని నమోదు చేయాలి.


6) మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆధారంగా రిజిస్టర్డ్ OTP వెరిఫికేషన్ లేకుండా డౌన్‌లోడ్ చేయాలనుకుంటే 'నా మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయబడలేదు (My Mobile number is not registered)' ఆప్షన్ ను ఎంచుకోవాలి.


7) మీరు ఇప్పుడు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్ లేదా ఆధార్ కార్డుకు గతంలో ఇవ్వని మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.


8) 'Send OTP' బటన్‌పై క్లిక్ చేయండి. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబరుకు OTP వస్తుంది. 


9) మీరు ఇప్పుడు తప్పనిసరిగా 'Terms and Condition' చెక్‌బాక్స్‌ని అంగీకరించాలి.


10) చివరిగా సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.


11) ఆ తర్వాత మీ ఆధార్ కార్డు ప్రివ్యూ తెరపై కనిపిస్తుంది. 


12) మేక్ పేమెంట్ ఎంపికపై క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో చెల్లింపు చేస్తే.. మీ ఆధార్ కార్డు కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 


Also Read: BSNL Recharge: BSNLలో ఉత్తమ ప్లాన్.. తక్కువ ఖర్చుతో 110 రోజుల వ్యాలిడిటీ!


Also Read: Covid XE Variant: దేశంలో కొత్త వేరియంట్‌ కలకలం..ఐదు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook