Aadhar Benefit: ఆధార్​ రాకతో వ్వస్థలో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని.. యూనిక్​ ఐడెంటిఫికేషన్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (యూఐడీఏఐ) సీఈఓ సురభ్​ గార్గ్​ గురువారం పేర్కొన్నారు. వ్యవస్థలో అక్రమంగా లబ్ది పొందే వారిని ఆధార్​తో అడ్డుకోగలిగినట్లు (UIDAI CEO Saurabh Garg) చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ పథకాలకు ఆధార్​ అనుసంధానం చేయడం వల్లే ఇది సాధ్యమైందని.. దీని ద్వారా ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.2.25 లక్షల కోట్లు ఆదా అయ్యిందని వివరించారు సురభ్​ గార్గ్​.


దీనితో పాటు అసలైన లబ్ధిదారులకు నేరుగా పథకాల ఫలితాలు అందుతున్నాయని కూడా పేర్కొన్నారు.


ఆధార్​ను పదేళ్ల క్రితం ప్రవేశపెట్టామని తెలిపారు (UIDAI launched Aadhar a decade ago) గార్గ్​. ఇప్పటి వరకు 131 కోట్ల మందికి ఆధార్​ కార్డ్​లను జారీ చేసినట్లు తెలిపారు. ఆధార్​కు సంబంధించిన అన్ని రకాల వ్యవహారాలను యూఐడీఏఐ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


పన్నెండు అంకెలతో కూడిన ఆధార్​ కార్డ్​.. దేశంలోని ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డుగా ఉంది. పలు పథకాలకు దీనితో అనుసంధానం చేయడం తప్పనిసరి చేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. బ్యాంక్​ ఖాతాలు, పాన్​కు కూడా ఆధార్​ అనుసంధానం తప్పనిసరి.


యూఐడీఏఐ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం అందించే 300 పథకాలకు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న 400 స్కీమ్​లకు ఆధార్​ అనుసంధానం తప్పని సరిగా ఉంది.


దేశంలో 99.7 శాతం మంది వయోజనులు ఆధార్​లో ఎన్​రోల్​ చేసుకున్నారు. నవజాత శిశువులకు ఆధార్​ ఇవ్వడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని యూఐడీఏఐ పేర్కొంది.


2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం దేశ ప్రజలందరికి ప్రత్యేక డిజిటల్​ గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆధార్​ను ప్రవేశపెట్టింది.


Also read: Omicron : ఒమిక్రాన్‌తో చాలా ప్రమాదం.. మొత్తం ఆరోగ్య వ్యవస్థే నాశనం.. శాస్త్రవేత్తల వార్నింగ్


Also read: Omicron: భారత్ ప్రమాదంలో ఉంది.. థర్డ్ వేవ్‌ను అడ్డుకోవాలంటే అదొక్కటే మార్గం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook