AAP national party status: జాతీయ పార్టీ హోదాతో.. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఆప్!
AAP national party status: జాతీయ స్థాయి పార్టీగా అవతరించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయంతో.. మరింత బలోపేతమైంది ఆప్. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
AAP national party status: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో విజయాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు మిగతా రాష్ట్రాలపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌తో పాటు వామపక్షాల పరిస్థితి రోజు రోజుకు దిగాజారుతుండడంతో జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఉవ్వీళ్లు ఊరుతోంది. 2012లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఆప్ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జాతీయ పార్టీ హోదా పొందేందుకు అడుగు దూరంలో ఆగిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ మోడల్ అంటూ జాతిని ఆకర్శించినట్లుగానే.. ఢిల్లీ మోడల్ పాలనతో దేశరాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ వ్యూహరచన చేస్తున్నారు.
గుజరాత్‌పై ప్రత్యేక దృష్టి..
పంజాబ్ ఎన్నికల్లో సాధించిన విజయంతో మంచి ఊత్సాహం మీద ఉన్న ఆప్.. రానున్న రోజుల్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అడుగుపెట్టబోతున్న ఆప్ ఎలాంటి స్ట్రాటజీతో వస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది.
జాతీయ స్థాయి పార్టీ హోదా లభించాలంటే?
అవినీతి నిర్మూలన అన్న ఏకైక అజెండాతో ఏ రాష్ట్రంలో అడుగుపెట్టినా అక్కడి వాళ్లను ఆకట్టుకుంటున్న కేజ్రివాల్... గుజరాత్ లో ఏం చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కాంగ్రెస్ పతనంతో జాతీయ స్థాయిలో ఖాళీ అయిన ప్రతిపక్షం హోదాను కైవసం చేసుకుంటే జాతీయ స్థాయిలో తనంతట తానే ఆప్ విస్తరిస్తుందని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇందు కోసం ఎన్నికలు జరగబోయే అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి లోక్‌సభలో 11 స్థానాలు గెల్చుకోవాలి. లేదా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 6% ఓట్లు సాధించాలి. లేదంటే నాలుగు, అంతకు మించి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. ఈ మూడింట్లో ఏది సాధించినా జాతీయ పార్టీగా ఈసీ గుర్తిస్తుంది.
ఆప్ బలం ఏ రాష్ట్రంలో ఎలా?
అయితే గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు 54% ఓట్లు వస్తే, పంజాబ్‌లో ఇప్పుడు 42% ఓట్లు పోల్ అయ్యాయి. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ 6.77% ఓట్లు పొందగా..... ఉత్తరాఖండ్‌లో 4శాతానికి దగ్గరలో ఓట్లు సాధించింది. అయితే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో కేవలం 0.3 శాతానికే పరిమితమైంది ఆప్. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధిస్తామన్న ఆత్మ విశ్వాసంతో ఆప్ ఉంది. 2024 ఎన్నికల నాటికి మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి 2% ఓట్లు సాధించి జాతీయ హోదా దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Also read: Congress Flop Show: ఉన్నదీ పోయిందీ.. అనుకున్నదీ చేజారింది.. అయోమాయంలో కాంగ్రెస్
Also read: CM Yogi Adityanath News: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేషధారణకు ఆ రాష్ట్రంలో విపరీతమైన క్రేజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook