UCC vs AAP: యూనిఫాం సివిల్ కోడ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం, యూసీసీకు మద్దతు
UCC vs AAP: యూనిఫాం సివిల్ కోడ్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై ప్రతిపక్షాల వైఖరికి భిన్నంగా ఆప్ నిర్ణయం ఉండటంతో చర్చనీయాంశమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
UCC vs AAP: దేశంలో త్వరలో యూనిఫాం సివిల్ కోడ్ యూసీసీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల ప్రధాని మోదీ ఈ విషయమై చేసిన ప్రకటనతో కామన్ సివిల్ కోడ్ చర్చనీయాంశమౌతోంది. అదే సమయంలో ఆప్ మాత్రం అందరికీ ఝలక్ ఇచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీ కామన్ సివిల్ కోడ్ విషయంలో ఇతర ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. ఆప్ పార్టీ యూనిఫాం సివిల్ కోడ్‌కు మద్దతు తెలిపింది. దేశానికి ఇది చాలా అవసరమని, అన్ని వర్గాల్ని ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు దోహదపడుతుందని ఆప్ స్పష్టం చేసింది. అయితే ఆప్ రాజకీయపరంగా తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బేనని చెప్పాలి. కామన్ సివిల్ కోడ్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు గళమెత్తుతున్న సంగతి తెలిసిందే. కానీ ప్రతిపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ యూనిఫాం సివిల్ కోడ్‌కు మద్దతిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే అన్ని మతాలతో చర్చించి ఏకాభిప్రాయం తీసుకోవాలని ఆప్ సూచించింది. భారత రాజ్యాంగంలకోని ఆర్టికల్ 44 సైతం యూనిఫాం సివిల్ కోడ్‌కే మద్దతిస్తుందని ఆప్ వ్యాఖ్యానించింది.
ఒక ఇంట్లో ఒకరికి ఓ చట్టం, మరొకరికి మరో చట్టం ఎలా సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బీజేపీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. యూనిఫాం సివిల్ కోడ్ పేరుతో ప్రజల్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని, ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. రాజ్యాంగం దేశ పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందనే సంగతిని గుర్తుంచుకోవాలన్నారు మోదీ.
యూసీసీపై ప్రధాని మోదీ ప్రస్తావనను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రధాని మోదీ యూసీసీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అందుకే ఆప్ తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలన్నీ ఓ దారిన ఉంటే..ఆప్ మరో దారిన ఉంటోంది. గతంలో కూడా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రామమందిర సమస్య, ఆర్టికల్ 370 రద్దు అంశాలకు మద్దతు పలికారు.
Also read: Chariot Catches Fire: హై టెన్షన్ వైరుకి రథం తగిలి ఏడుగురు మృతి, 18 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook