Satyendra Jain: జైలులో మంత్రికి మసాజ్.. నెట్టింట వీడియో లీక్
Satyendra Jain Massage Video Leaked: ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ ఆద్మీ పార్టీకి షాకిచ్చేలా.. ఆ పార్టీ మంత్రి మసాజ్ వీడియో లీక్ అయింది. జైలులో హాయిగా మాసాజ్ చేయించుకుంటున్న మంత్రి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Satyendra Jain Massage Video Leaked: ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకుంటున్న సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన.. మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. జైలు గదిలో అమర్చిన సీసీటీవీలో సత్యేందర్ జైన్ మసాజ్ వీడియో రికార్డు అయింది. ఆయన పాదాలకు ఓ వ్యక్తి మసాజ్ చేస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తీహార్ జైలులో సత్యేందర్ జైన్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నాని ఇటీవలె ఈడీ కూడా ఆరోపించింది.
తీహార్ జైలులోని సెల్-4 బ్లాక్ ఎలోని సీసీటీవీ ఫుటేజీ ఇది. జైన్‌కు జైలులో మసాజ్ చేస్తున్నారని ఈడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఆయన తల, ఫుట్, బ్యాక్ మసాజ్ జరుగుతుందని తెలిపింది. ఇదే సీసీటీవీ ఫుటేజీలో కూడా కనిపిస్తోంది. తీహార్ జైలు సత్యేందర్ జైన్‌కు మసాజ్ చేస్తున్న దృశ్యాలను ఈడీ తీసి బయటపెట్టింది. అయితే మసాజ్ ఫుటేజీని నిలిపివేయాలని జైన్ కోర్టును ఆశ్రయించారు.
వీడియోలో మంత్రి సత్యేందర్ జైన్ బెడ్‌పై హాయిగా పడుకుని తల, ఫుట్, హ్యాండ్, బ్యాక్ చేయించుకుంటున్నారు. పక్కనే మినరల్ వాటర్ బాటిళ్లను ఉంచడం వీడియోలో కనిపిస్తోంది. జైల్లో ఆప్ మంత్రి విలాసానికి సంబంధించిన ఈ మొత్తం వీడియో వైరల్‌గా మారింది. తీహార్ జైలులో ఉన్న ఈ వీడియో ద్వారా వెల్లడైన విషయాలను ఇప్పటికే ఈడీ కోర్టులో వెల్లడించింది. ఇప్పుడు ఈడీ కోర్టులో చెప్పిన దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టింది.
ఆప్ నేత సత్యేందర్ జైన్ మసాజ్ వ్యవహారంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. బీజేపీ చౌకబారు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. సత్యేందర్ జైన్ గత 6 నెలలుగా జైల్లో ఉన్నారని.. అతను జైలులో పడిపోవడంతో వెన్నెముక దెబ్బతిందన్నారు. జైన్ శస్త్రచికిత్స చేయించుకున్నారని.. ఆసుపత్రికి సంబంధించిన కొన్ని కాగితాలను ఆయన చూపించారు.
వైద్యులు సత్యేందర్ జైన్‌కు ఫిజియోథెరపీ అవసరమని లేఖ రాశారని.. దాని కారణంగా మసాజ్ చేయించుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. జబ్బుపడిన వ్యక్తి వీడియోను విడుదల చేసి బీజేపీ ఎగతాళి చేస్తోందన్నారు. ఎంసీడీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ నీచానికి దిగజారిందని ఫైర్ అయ్యారు. ఒక వ్యక్తి అనారోగ్యాన్ని ఎగతాళి చేసి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ భావిస్తోందన్నారు. ఈ వీడియోపై బీజేపీ కూడా కౌంటర్ ఇస్తోంది. అది ఆమ్ ఆద్మీ పార్టీ కాదని.. మసాజ్ పార్టీ అంటూ ఎద్దేవా చేస్తోంది.
Also Read: Kaala Bhairava: శత్రువులను జయించేందుకు కాలభైరవ పూజ చేయండి.. శనివారం పూజ చేస్తే విజయం మీదే..
Also Read: Weight Loss Tips: చలి కాలంలో రాత్రి ఇలా వాకింగ్ చేస్తే అధిక బరువు, మధుమేహం సమస్యలు శాశ్వతంగా దూరం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook