కర్ణాటక ( Karnataka )లో జరిగిన ఏసీబీ దాడులు ( ACB RAIDS ) సంచలనం కల్గించాయి. మహిళా ఐఏఎస్ అధికారిణి నివాసంలో ఇవాళ అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. భారీగా నగదు, బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కర్నాటక మహిళా ఐఏఎస్ అధికారిణి సుధ నివాసంపై జరిగిన ఏసీబీ దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యాయి. రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ అండ్ బయో టెక్నాలజీ శాఖలో ఆఫీసర్‌గా పని చేస్తున్న సుధపై అందిన ఓ ఫిర్యాదు ఆధారంగా ఆమె నివాసంపై దాడులు జరిగాయి. కొడిగహల్లి, ఎలహంక, మైసూరు, ఉడిపిలో ఉన్న సుధ ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. గతంలో ఆమె బెంగుళూరు డెవలప్‌మెంట్ అథారిటీ ( BENGALURU DEVELOPMENT AUTHORITY ) లో ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్‌గా పనిచేసింది. సుధ అవినీతికి సంబంధించి లోకాయుక్తలో పిటిషన్‌ దాఖలు చేయడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుధ భర్త శాండల్‌వుడ్‌లో సినీ నిర్మాత. సుధ అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఆమె భర్త సినిమాలను నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


దాడుల్లో పెద్దఎత్తున నగదు, బంగారు ఆభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  Also read: PSLV-C49 mission అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు