PSLV-C49 mission అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు

PSLV-C49 launched from SDSC: న్యూ ఢిల్లీ: పీఎస్ఎల్వీసీ49 ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ( ISRO ) సాధించిన విజయం సాధారణమైన విజయం కాదని ఇస్రో చీఫ్ కే శివన్ ( ISRO chief K Sivan ) అభిప్రాయపడ్డారు. '' అంతరిక్ష ప్రయోగాలు లాంటివి ఇంటి దగ్గరి నుంచి పని చేసి ( Work from home ) సాధించేవి కావు.

Last Updated : Nov 7, 2020, 06:37 PM IST
PSLV-C49 mission అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు

PSLV-C49 launched from SDSC: న్యూ ఢిల్లీ: పీఎస్ఎల్వీసీ49 ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ( ISRO ) సాధించిన విజయం సాధారణమైన విజయం కాదని ఇస్రో చీఫ్ కే శివన్ ( ISRO chief K Sivan ) అభిప్రాయపడ్డారు. '' అంతరిక్ష ప్రయోగాలు లాంటివి ఇంటి దగ్గరి నుంచి పని చేసి ( Work from home ) సాధించేవి కావు. అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన ప్రతీ ఒక్క ఇంజనీర్, సాంకేతిక నిపుణులు స్వయంగా పరిశోధన కేంద్రానికి రావాల్సి ఉంటుంది. పరిశోధనలో పాల్పంచుకునే సిబ్బంది ప్రతీ ఒక్కరూ ఒకరినొకరు సమన్వయపర్చుకుంటూ ప్రయోగశాలలో పనిచేయాల్సి ఉంటుందని.. అప్పుడే విజయం సాధిస్తాం'' అని కే శివన్ పేర్కొన్నారు. PSLV-C49 ప్రయోగం విజయవంతమైన అనంతరం శివన్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగంలో తాము ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు, అధిగమించిన సవాళ్లను గురించి వివరించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.  

During this pandemic, team ISRO raised to the occasion, worked as per COVID guidelines, without compromising on quality. It's really heartening to see all ISRO employees doing quality work at this time: ISRO Chief K Sivan
(file pic) pic.twitter.com/OnQ49q1YEJ

PSLV-C49 ప్రయోగంతో విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) అభినందించారు. కరోనావైరస్ కాలంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఎన్నో సవాళ్లను అధిగమించి మరీ ఈ ప్రయోగంలో విజయం సాధించారని ప్రధాని మోదీ ప్రశంసించారు.

Also read : PSLV-C49: ISRO ప్రయోగించిన PSLVC49 విజయవంతం.. నింగిలోకి ఒకేసారి 10 ఉపగ్రహాలు

ఇస్రో నేడు చేసిన PSLV-C49 mission ప్రయోగంతో భారత్‌కి చెందిన EOS-01 శాటిలైట్‌తో పాటు మూడు దేశాలకు చెందిన మరో 9 ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తొలుత భారత్‌కి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ( EOS-01)ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనంతరం మిగతా 9 ఉపగ్రహాలను కూడా పీఎస్ఎల్వీ-C49 విజయవంతంగా ఆర్బిట్‌లోకి ఇంజెక్ట్ చేసింది. విదేశాలకు చెందిన ఉపగ్రహాలలో ఒకటి లిత్వేనియాకు చెందిన ఆర్2 ఉపగ్రహం ( R2 Satellite ) కాగా, మరో నాలుగు యూరప్‌లోని లగ్జంబర్గ్‌, ఇంకో నాలుగు అమెరికాకు చెందిన లెమూర్ (Lemur-1/2/3/4 satellites) ఉపగ్రహాలు ఉన్నాయి. 

Watch Live: Launch of EOS-01 and 9 customer satellites by PSLV-49 https://t.co/H4jE2fUhNQ

కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus pandemic ) వ్యాప్తి, లాక్‌డౌన్ అనంతరం తొలిసారిగా భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో చేసిన ఉపగ్రహ ప్రయోగం ఇదే. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 3.02 గంటలకు ఉపగ్రహ ప్రయోగం చేయాల్సి ఉన్నప్పటికీ.. భారీ వర్షం కారణంగా మిషన్ డైరెక్టర్ ఈ ప్రయోగాన్ని 10 నిమిషాలు వాయిదా వేసినట్టు ఇస్రో ట్విటర్ ద్వారా వెల్లడించింది. దీంతో 10 నిమిషాలు ఆలస్యంగా 3.12 గంటలకు పీఎస్ఎల్వీ-సీ49ని లాంచ్ చేసి అనుకున్నదాని ప్రకారమే ఇస్రో శాస్త్రవేత్తలు విజయం సాధించారు.  

Also read : US Election Results: ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ జో బిడెన్‌దే ఆధిక్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News