Rajinikanth Casts Vote: ఓటు హక్కు వినియోగించుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్
Rajinikanth casts vote | హ్యాట్రిక్ కొట్టాలని అధికార అన్నాడీఎంకే(AIADMK) బీజేపీతో కలిసి బరిలో నిలిచింది. పదేళ్లపాలు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పార్టీ, కాంగ్రెస్‌తో కలిసి అధికారం హస్తగతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని, హ్యాట్రిక్ కొట్టాలని అధికార అన్నాడీఎంకే(AIADMK) బీజేపీతో కలిసి బరిలో నిలిచింది. పదేళ్లపాలు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పార్టీ, కాంగ్రెస్‌తో కలిసి అధికారం హస్తగతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటి ఉదయం 7 గంటలకు మొదలైంది. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న స్టెల్లా మేరిస్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన రజనీకాంత్ తన ఓటు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రజనీకాంత్(Rajinikanth)కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: Horoscope Today: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 06, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధననష్టం
సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న రజనీకాంత్ రాజకీయ ప్రస్తావన అరంగేట్రం చేయకుముందే ముగిసింది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లోకి రాలేకపోతున్నానంటూ కొన్ని నెలల కిందట కీలక ప్రకటన చేసి తన అభిమానులను రజనీకాంత్ నిరాశపరిచారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. అయితే తమిళనాడు(Tamil Nadu Elections 2021)లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు రజనీకాంత్ పిలుపునిచ్చారు.
Also Read: Home loans interest rates: హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు పెంచిన SBI.. హోమ్ లోన్స్ భారం పెరగనుందా ?
తమిళనాడులో 6 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరికి గాలం వేసేందుకు అధికార అన్నాడీఎంకేతో పాటు ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేతలు భారీగా హామీల వర్షం కురిపించారు. ఆ హామీలు చూసి ఏకంగా మద్రాస్ హైకోర్టు సైతం స్పందించింది. ప్రజలను బద్ధకస్తులు చేసే పథకాలు అవసరమా అనే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,998 మంది అభ్యర్థులు బరిలో దిగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook