Rajinikanth on fans | న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి వచ్చేదే లేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి స్పష్టంచేశారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రాలేనని, దయచేసి తనను ఒత్తిడి చేయొద్దంటూ అభిమానులకు రజనీకాంత్ (Rajinikanth) విజ్ఞప్తి చేశారు. రజనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రాజకీయాల్లోకి రావాలని వస్తున్న విజ్ఞప్తులు, నిరసనలపై ఆయన విచారం వ్యక్తంచేశారు. అభిమానులు (Rajinikanth fans) తన మాటకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని.. ఈ సంఘటనలు తనను బాధ కలిగిస్తున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు రజనీకాంత్ సోమవారం భావోద్వేగంతో కూడిన ప్రకటనను విడుదల చేశారు. Also Read: Rajinikanth: రాజకీయ అరంగ్రేటంపై తలైవా సంచలన నిర్ణయం
అనారోగ్యం నుంచి కోలుకున్న అనంతరం డిసెంబరు 30న తాను రాజకీయాల్లోకి (Rajinikanth Political) రానంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఆయన రాజకీయ ప్రవేశం చేయాల్సిందేనంటూ ఆయన అభిమాన సంఘమైన రజనీ మక్కల్ మండ్రం (Rajini Makkal Mandram) లోని కొంతమంది బహిష్కృత నేతలు, అభిమానులు చెన్నైలో ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే రజనీ రాజకీయాల్లోకి ప్రవేశించాలని (Tamil nadu) అభిమానులు కోరుతుండగా.. రజనీ మరోసారి రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూ ప్రకటనను విడుదల చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook