Sonu Sood Sister Moga: అద్భుతమైన నటనతో పాటు కొవిడ్‌ సమయంలో విశేష సేవాకార్యక్రమాలతో ప్రజల ఆదరణ పొందిన నటుడు సోనూ సూద్‌ ఆదివారం కీలక ప్రకటన చేశారు. తన సోదరి మాళవిక సూద్‌ రాబోయే పంజాజ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరనున్నారనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

“మాళవిక (పోటీకి) సిద్ధమయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత సాటిలేనిది. రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. కేవలం సాధారణ సమావేశాలు మాత్రమే కాదు. ఇది పూర్తిగా సిద్ధాంతాలతో ముడిపడిన అంశం. ఏ పార్టీలో చేరనున్నారనేది సరైన సమయంలో ప్రకటిస్తాం” అని మోగాలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో సోనూ సూద్‌ ప్రకటించారు.


సోనూ సూద్‌ ఆయన సోదరి మాళవికతో కలిసి ఇటీవలే పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని కలిశారు. గతంలో సోనూ సూద్‌ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే దిల్లీ ప్రభుత్వం చేపట్టిన ‘దేశ్‌ కా మెంటార్స్‌’ అనే కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నారు.


Also Read: Pradhan Mantri Awaas Yojana: రూ. 700 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ప్రధాని మోదీ


Also Read: Amravati Violence: అమరావతిలో కర్ఫ్యూ.. పలు ప్రాంతాల్లో ఇంటర్నేట్ సేవలు బంద్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook