Madhya Pradesh Assembly Election Results: మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 230 స్థానాల్లో 163 స్థానాల్లో విజయం సాధించి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలకే పరిమితమైంది. భారత్ ఆదివాసీ పార్టీ ఒక సీటును సొంతం చేసుకుంది. మరోస్థానంలో ఎన్నికలు జరగలేదు. ఇక కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో బీజేపీ అధిష్టానం బిజీగా ఉంది. శివరాజ్ సింగ్ చౌహన్‌కే మళ్లీ అవకాశం కల్పిస్తుందో లేదో చూడాలి. ఎమ్మెల్యేల గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాసనసభకు కొత్తగా ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వాచ్‌డాగ్ నివేదిక వెల్లడించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రచురించిన నివేదిక ప్రకారం.. రాష్ట్రాల్లోని కొత్త చట్టసభ సభ్యులలో దాదాపు 39 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తేలింది. “2023లో నిర్వహించిన సర్వేలో 230 మందిలో గెలిచిన 90 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొనట్లు తేలింది. 


రాష్ట్రంలో దాదాపు 15 శాతం అంటే 34 మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి” అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. క్రిమినల్ కేసులు ఉన్న 90 మంది ఎమ్మెల్యేల్లో 51 మంది బీజేపీకి చెందిన వారు కాగా.. 38 మంది కాంగ్రెస్‌కు చెందినవారు.. ఒకరు భారతీయ ఆదివాసీ పార్టీకి చెందిన వారు. 2018 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 94 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో 90 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 


205 మంది ఎమ్మెల్యేలు అంటే దాదాపు 89 శాతం మంది కోటీశ్వరులు లేదా బిలియనీర్లు అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఈ కోటీశ్వరుల్లో 144 మంది బీజేపీకి చెందిన వారు కాగా.. 61 మంది కాంగ్రెస్‌కు చెందిన వారని పేర్కొంది. రత్లాం జిల్లాలోని రత్లాం నగర నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే చెతన్య కశ్యప్ రాష్ట్రంలో అత్యంత ధనిక ఎన్నికైన శాసనసభ్యుడు అని.. ఆయనకు రూ.296 కోట్లకు పైగా ఆస్తులను ఉన్నాయి. అదేవిధంగా కట్నీ జిల్లాలోని విజయరాఘవగఢ్ అసెంబ్లీ స్థానానికి చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సత్యేంద్ర పాఠక్ రూ.242 కోట్లకు ఆస్తులు ఉన్నాయి. 161 మంది ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్లు లేదా విద్యార్హత కంటే ఎక్కువ ఉన్నవారు కాగా.. 64 మంది ఎమ్మెల్యే తమ విద్యార్హత 5వ తరగతి నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత మధ్య ఉన్నట్లు ప్రకటించారు. 


Also Read:  Revanth Reddy: ఇదే నా ఆహ్వానం.. ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ


Also Read:  BAN vs NZ 2nd Test: ఇవే తగ్గించుకుంటే మంచిది..! విచిత్రంగా ఔటైన బంగ్లా సీనియర్ బ్యాట్స్‌మెన్.. వీడియో ఇదిగో..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి