Mushfiqur Rahim Out Video: రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించి సిరీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా.. ఇరు జట్ల మధ్య 2వ చివరి టెస్టు మ్యాచ్ బుధవారం ఢాకా వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ జట్టు 66.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫీకర్ రహీమ్ 35 అత్యధిక పరుగులు చేశాడు. షాహదత్ హుస్సేన్ (31) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన ముష్పీకర్ రహీమ్.. మంచి ఆటతీరు కనబర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ.. 83 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఈ క్రమంలో జేమీసన్ బౌలింగ్‌లో అనూహ్య రీతిలో ఔట్ అయ్యాడు. జేమిసన్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడగా.. బాల్ వికెట్ల నుంచి దూరంగా వెళుతున్నా కావాలనే చేతితో చేతితో దూరంగా నెట్టాడు. దీంతో కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రిప్లైలు పరిశీలించిన థర్డ్ అంపైర్.. కావాలనే బంతిని చేతితో నెట్టిడడంతో ఔట్‌గా ప్రకటించాడు. అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్ కింద ఔటైన ముష్పికర్ రహీమ్.. నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు.
ఐసీసీ రూల్ 37.1.2 ప్రకారం.. బౌలర్ వేసిన బంతిని ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్‌మెన్ బ్యాట్‌తోకాకుండా చేతితో తాకడం లేదా అడ్డుకోవడం వంటివి చేయకూడదు. ముష్పికర్ రహీమ్ ఈ తప్పు కిందే ఔట్ అయ్యాడు. ఒకవేళ బంతి వికెట్లను తాకేలా కనిపిస్తే బ్యాట్‌తో దూరంగా కొట్టొచ్చు. కానీ చేతితో తాకకూడదు. సీనియర్ ప్లేయర్ అయిన ముష్పికర్.. ఇలా ఔట్ అవ్వడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
Mushfiqur Rahim out for obstructing the field.
- He is the first Bangladesh batter to dismiss by this way in cricket history.pic.twitter.com/MfZONDzswk
— Johns. (@CricCrazyJohns) December 6, 2023
అయితే సరిగ్గా నెల రోజుల క్రితం వరల్డ్ కప్‌లో జరిగిన సంఘటనను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. వరల్డ్ కప్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్డ్ ఔట్‌తో లింక్ చేస్తున్నారు. ఆ రోజు హెల్మెట్ స్ట్రిప్ సమస్య వల్ల క్రీజ్‌లోకి వచ్చినా.. మ్యాథ్యూస్ బ్యాటింగ్‌కు సిద్ధం కాలేకపోయాడు. దీంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఔట్ కోసం అప్పీల్ చేశారు. తాను కావాలని చేయలేదని.. హెల్మెట్ వల్లే సమస్య వచ్చిందని మ్యాథ్యూస్ చెప్పినా బంగ్లా ఆటగాళ్లు అప్పీల్‌ను వెనక్కి తీసుకోలేదు. అప్పుడు బంగ్లా కెప్టెన్ షకీబుల్ హాసన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు బంగ్లా ప్లేయర్‌గా కూడా అనూహ్య రీతిలో ఔట్ అవ్వడంతో కర్మఫలం అనుభవించక తప్పదంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Revanth Reddy: ఇదే నా ఆహ్వానం.. ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Also Read: కొబ్బరి నీళ్ల వల్ల హెల్త్ బెనిఫిట్స్.. ఈ టైంలో తీసుకుంటే మాత్రమే శ్రేయస్కరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి