బాబ్రీ మసీదు విధ్వంసం ( Babri mosque Demolition ) . దేశ రాజకీయాన్ని మార్చేసిన అంశం. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నిందితులంతా నిర్దోషులేనని సీబీఐ ప్రత్యేక కోర్టు ( CBI Special Court ) తీర్పు వెలువరించింది. దీనిపై బీజేపీ సీనియర్ నేత నిర్దోషిగా ప్రకటితమైన ఎల్కే అద్వానీ ఏమన్నారు మరి ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1992 డిసెంబర్ 6 శుక్రవారం. లక్షలాది మంది కరసేవకులు అయోధ్య ( Ayodhya ) లోని బాబ్రీ మసీదుకు చేరుకున్నారు. చూస్తుండగానే  ఆ కట్టడం విధ్వంసమైపోయింది. ఈ కూల్చివేత ఘటనలో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ( Lk Advani ), మురళీ మనోహర్ జోషి ( Murali manohar joshi ) సహా 32 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సాధారణంగా సీబీఐ కోర్టుల్లో మెజార్టీ తీర్పులు సీబీఐ దర్యాప్తును సమర్థించేవిగానే ఉంటాయి కానీ...ఈ కేసులో సీబీఐకు చుక్కెదురైంది. సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించలేదు.  


1990వ దశకంలో తన రథయాత్ర ద్వారా హిందూ సమూహాన్ని ఏకం చేసి, రామమందిరం ఉద్యమానికి బీజం వేసిన వ్యక్తి ఎల్కే అద్వానీ. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామజన్మభూమిగా ( Ram janma bhoomi ) భావించే చోట.. ఆలయాన్ని తొలగించి, నాటి మొఘల్ పాలకులు మసీదు కట్టారన్న వాదనను బలంగా వినిపించడంతోపాటు, మసీదును తొలగించి మందిరాన్ని నిర్మించాలనేది అద్వానీ, ఇతర నేతలు డిమాండ్ చేశారు. అద్వానీ, ఇతర సంఘ్ నేతల పిలుపుతో 1992 డిసెంబర్ లో లక్షలాది మంది కరసేవకులు అయోధ్య పయనమయ్యారు. మసీదు కూల్చివేతకు గురైంది. దీనికి అద్వానీ ఇతర నేతల రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని సీబీఐ ఆరోపించింది. కానీ లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు మాత్రం సీబీఐ అభియోగాలను తోసిపుచ్చుతూ.. అద్వానీ సహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.


కోర్టు తీర్పుపై అద్వానీ స్పందన


జై శ్రీరాం నినాదంతో తన స్పందనను విన్పించారు అద్వానీ. మనస్ఫూర్తిగా కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాను. రామ మందిరం ఉద్యమం పట్ల నా వ్యక్తిగత, బీజేపీ ( BJP ) పార్టీ నిబద్ధతకు నిదర్శనంగా ఈ తీర్పును భావిస్తున్నాను. నా చిరకాల కోరిక అయోధ్య మందిరంపై సుప్రీంకోర్టు తీర్పు, ఇటీవలే భూమి పూజ కూడా జరిగిన నేపథ్యంలో ఇంకా మహదానందంగా ఉంది. ఇక భవ్యరామ మందిర నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని నా దేశప్రజలతో కలిసి ఎదురుచూస్తున్నాను'' అని అద్వానీ తెలిపారు.


బాబ్రీ మసీదు విధ్వంసం కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన తరువాత ఢిల్లీలోని అద్వానీ ఇంటి వద్ద సందడి కన్పించింది. 92 ఏళ్ల అద్వానీ అనారోగ్యం, వయస్సు కారమంగా రాజకీయాలకు దూరంగా  ఇంటివద్దే ఉంటున్నారు. ముందుగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ( Central Ravisankar prasad )..అద్వానీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పి సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం ఒక్కొక్క నేత అద్వానీ ఇంటికి వెళ్లడం ప్రారంభించారు. Also read: Babri Masjid Demolition Verdict: బాబ్రీ కూల్చివేత ప్లాన్ కాదు.. అందరూ నిర్దోషులే