Tamilnadu cm stalin comments on newly weds have 16 childrens: ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా, సీఎం చంద్రబాబు యువత రేటు తక్కువ అయిపోయిందన్నారు. జంటలు ఎక్కువగా పిల్లల్ని కనేలా ప్లాన్ లు చేసుకొవాలన్నారు. ఇటీవల ఏపీలో యువత జనాభా తక్కువైందని అన్నారు. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు కంటే.. ఎక్కువగా సంతానం ఉన్నవారికి సైతం.. పిల్లల్ని కనే విధంగా మార్పులు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో.. పిల్లల్ని కనే ఫ్యామిలీకి ప్రొత్సాహాకం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొందరలోనే దీనిపై గుడ్ న్యూస్ చెప్తామని కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు పిల్లల్ని కనాలని చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా, మరో ముఖ్యమంత్రి కూడా..  పిల్లల్ని కనడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.  సీఎం స్టాలీన్.. ఒక సాముహిక వివాహాం కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతే కాకుండా.. పెళ్లయిన జంటలు కనీసం 16 మంది పిల్లల్ని కనాలని కూడా పిలుపునిచ్చారు.


 ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎందుకు పరిమితం కావాలని.. 16 మందిని ఎందుకు కనకూడదంటూ  కూడా సీఎం స్టాలీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని హిందూ రిలిజియస్ అండ్ ఎండోమెంట్ బోర్డ్ నిర్వహించిన కార్యక్రమానికి స్టాలిన్ హాజరయ్యారు. 


Read more: Salman Khan: సల్మాన్‌కు బొద్దింకల్ని చంపడం కూడా తెలీదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన సల్లు భాయ్ తండ్రి.. వీడియో వైరల్..


ఆయన సమక్షంలో 31 జంటలు పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. 16 మందిని కనే సమయం వచ్చిందన్నారు. పూర్వకాలంలో పెద్ద కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు 16 రకాల సంపదలు రావాలని ఆశీర్వదించేవారని,ఇప్పుడు 16 ఆస్తులకు బదులు 16 మంది పిల్లల్ని కనే సమయం వచ్చిందంటూ స్టాలీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.