Ban on Panipuri: మొన్న దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చిన్నారులు అత్యంత ఇష్టంగా తినే కాటన్ క్యాండీపై నిషేధం సంచలనంగా మారింది. ఇప్పుడు త్వరలో వయస్సుతో సంబంధం లేకుండా అత్యంత ప్రీతిపాత్రమైన పానీ పూరీ సైతం నిషేధానికి గురి కానుందని తెలుస్తోంది. పానీ పూరీపై నిషేధం విధించే వార్తల వెనుక కారణాలేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న ఊరైనా, పట్టణమైనా, నగరమైనా సాయంత్రమైతే చాలు చిన్నారులు, యువతీ యువకులు, పెద్దలు అత్యంత ఇష్టంగా పానీ పూరీ బండ్ల దగ్గర కన్పిస్తుంటారు. కొన్నిచోట్ల వెయిటింగ్ ఉన్నా ఇబ్బంది పడరు. అంత ఇష్టంగా తింటుంటారు. అలాంటి పానీ పూరీలో కేన్సర్ కారకాలున్నాయనే విషయమే ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల కర్ణాటకలో జరిపిన తనిఖీల్లో కొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. పానీ పూరీలో వినియోగించే నీళ్లకు రంగు వచ్చేందుకు కొన్ని కెమికల్స్ వాడుతున్నట్టుగా తేలింది. ఈ రసాయనాల్లో కేన్సర్ కారకాలున్నట్టు కర్ణాటక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. రాష్టవ్యాప్తంగా మొత్తం 276 షాపుల్నించి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. ఇందులో 41 శాంపిల్స్‌లో కేన్సర్ కారక రసాయనాలు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో పానీ పూరీపై నిషేధం విధించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.


కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందించిన సమాచారంలో పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ రాష్ట్రంలో కూడా ఇవే రకమైన కేన్సర్ కారక రసాయనాలు పానీపూరీ నీళ్లలో ఉన్నట్టు తేలింది. దాంతో అత్యంత నాణ్యత కలిగి దుకాణాల్లో తయారు చేసిన పానీ పూరీలే తినాలని తమిళనాడు ప్రభుత్వం సూచిస్తోంది. నిర్ధారిత ప్రమాణాలు పాటించే విధంగా నిబంధనలు జారీ చేయడం అందుకు తగ్గట్టుగా కొన్ని ఎంపిక చేసిన షాపుల్లోనే పానీ పూరీని నిషేధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


పానీ పూరీతో పాటు గోబీ మంచూరియా, కబాబ్ వంటి ఆహార పదార్ధాల తయారీలో సైతం కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ కృత్రిమ రంగుల వల్ల అలర్జీ, హైపర్ యాక్టివిటీ, అరుగుదల సమస్యలు తలెత్తవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ తరహా కృత్రిమ రంగులు వాడే పదార్ధాలు తినడం వల్ల దీర్ఘకాలంలో కేన్సర్ బారిన పడవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


Also read: Neet UG Row: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. దేశ వ్యాప్తంగా రేపు స్కూళ్లు, కాలేజీలకు బంద్.. భారీగా నిరసనలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook