DRDO Agni P: డిఫెన్స్​ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్​ ఆర్గనైజేషన్​ (డీఆర్​డీఓ) మరో విజయం సాధించింది. కొత్త జెనరేషన్​ బాలిస్టిక్​ మిస్సైల్​ 'అగ్ని పి'ని విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్ (Agni P successfully testfired)​ నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంతక కచ్చితత్వంతో​ చేరుకున్నట్లు డీఆర్​డీఓ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్​ కలామ్​ ఐలాండ్​లో శనివారం (డిసెంబర్ 18) ఈ మిస్సైల్​ను విజయవంతంగా పరీక్షించినట్లు వివరించింది డీఆర్​డీఓ(DRDO). తాజా పరీక్షల్లో ఈ వ్యూహాత్మక క్షిపణి ఫలితాలు ఆశించిన స్థాయిలో (Agni P latest news) వచ్చినట్లు పేర్కొంది.



ఏమిటి ఈ 'అగ్ని పి' క్షిపణి..


అగ్ని క్షిపణుల్లో సరికొత్త టెక్నాలజీ రూపొందించిందే ఈ 'అగ్ని పి' క్షిపణి. దీని సామర్థ్యం 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల శ్రేణి వరకు ఉంటుంది.


ఇది రెండు దశల కానిస్ట్రేటెడ్ సాలిడ్-ప్రొపెలెంట్ బాలిస్టిక్ మిసైల్​ కావడం గమనార్హం.


తాజాగా ప్రయోగించిన మిస్సైల్​ అన్ని అంచనాలను అత్యంత కచ్చితత్వంతో అందుకున్నట్లు వివరించింది రక్షణ శాఖ. ఈ నేపథ్యంలో డీఆర్​డీఓకు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ (Rajnath Singh) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మిస్సైల్ పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు.


అగ్ని ఆయుధాల గురించి..


భారత అణు ప్రయోగ సామర్థ్యానికి అత్యంత ప్రధానమైనవి అగ్ని ఆయుధాలు. ఇందులో పృథ్వి వంటి స్వల్ప శ్రేణి బాలిస్టిక్​ క్షిపణులతోపాటు.. జలాంతర్గాములు, యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. 5 వేల కిలో మీటర్ల లక్ష్యాన్ని సైతం చేధించగల సామర్థ్యం ఉన్న క్షిపణులు కూడా అగ్ని శ్రేణిలో ఉన్నాయి.


Also read: 16 ఏళ్లకే రజస్వల అయితే... మహిళల వివాహ వయసు పెంపుపై ఎస్పీ ఎంపీ షాకింగ్ కామెంట్స్


Also read: Omicron scare in India: అలాంటి పరిస్థితులే వస్తే రోజుకు 14 లక్షల కరోనా కేసులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook