Omicron scare in India: ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోకి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఆలస్యంగా కాస్త ప్రవేశించినా.. దేశంలో మాత్రం వేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) 100 దాటాయి. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నియమించిన కొవిడ్ టాస్క్ ఫోర్స్ (Covid task force) ఆందోళనకర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం బ్రిటన్, ఫ్రాన్స్‌లో చూస్తున్న పరిస్థితులు భారత్‌కూడా నెలకొంటే.. కేసులు భారీగా పెరుగతాయని తెలిపింది. భారీ జనాభా కారణంగా అలాంటి పరిస్థితులు వస్తే రోజుకు 14 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యే (Corona third wave) ప్రమాదముందని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ హెచ్చరించారు.
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో సగటున 65 వేల కేసులు (France daily corona cases) నమోదవుతున్నాయి. అలాంటి పరిస్థితులను మన దేశంలో వస్తే రోజుకుగు 13 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదముంని తెలిపారు వీకే పాల్.
ఇక బ్రిటన్లో రోజువారీ కేసులు ఇటీవల గరిష్ఠ స్థాయిని తాకాయి. ఒక్క రోజులో అత్యధికంగా 88,042 కేసులు నమోదయ్యాయి. అందులో 2.4 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వి కావడం ఆందోళనకరమైన విషయం.
యూరప వ్యాప్తంగా 80 శాత మంది పాక్షికంగా కరోనా వ్యాక్సిన్ (Corona vaccine) తీసుకున్నారు. అయినప్పటికీ.. డేల్టా వేరియంట్ కేసులు మాత్రం తగ్గటం లేదు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో అనవసర ప్రయాణాలు మానుకోవాలని, న్యూ ఇయర్ వేడుకల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు పాల్. పార్టీలు, సమూహాలుగా ఏర్పడటం వంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు.
ప్రస్తంత దేశంలో కరోనా కేసులు 8 వేల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్ భయాలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఇతర దేశాల్లో కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని సూచించారు వీకే పాల్. మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడటం, టీకాలు వేయించుకోవడం వంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.
Also read: Covavax: కోవావాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ ఆమోదం
Also read: Omicron Cases: భారత్‌లో ఒమిక్రాన్ విజృంభన, 109 కి చేరిన కేసులు..జాగ్రత్త అంటోన్న కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Omicron scare in India: అలాంటి పరిస్థితులే వస్తే రోజుకు 14 లక్షల కరోనా కేసులు!
ఒమిక్రాన్ వేరియంట్‌పై కొవిడ్ టాస్క్ ఫోర్స్ ఆందోళన
యూరప్ పరిస్థితులు ఏర్పడితే విధ్వంసమేనని వెల్లడి
ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక