AIIMS Forensic team rejects murder theory in Sushant Singh Rajput death case: న్యూఢిల్లీ: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి ఇటు సినీ ఇండస్ట్రీలో.. అటు రాజకీయ వర్గాల్లో వైరం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. అయితే జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బంద్రా నివాసంలో (sushant death) మరణించాడు. అప్పుడు సుశాంత్ మరణంపై మొదట ముంబై పోలీసులు (Mumbai Police) విచారించారు. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు, బీహార్ ప్రభుత్వ వినతి మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. సీబీఐ (CBI) విచారణలో డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కూడా ఈ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్‌సీబీ సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty,)తోపాటు చాలా మందిని అరెస్ట్ చేసింది. అంతేకాకుండా టాప్ హీరోయిన్లను సైతం (Drugs Case) విచారించింది. ఈ క్రమంలోనే సుశాంత్‌‌ది హత్య లేక ఆత్మహత్యనా..? అనే విషయానికి సంబంధించి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఫోరెన్సిక్ విభాగం సీబీఐకి నివేదికను శనివారం సమర్పించింది. సుశాంత్‌ది హత్య అంటూ పలువురు చేస్తున్న ఆరోపణలను ఫోరెన్సిక్ వైద్యులు తోసిపుచ్చారు. Also read: Prabhas: మీ ప్రేమకు.. థ్యాంకూ డార్లింగ్స్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సుశాంత్‌కు విషం ఇచ్చి గొంతు నులిమి చంపినట్లు నటుడి కుటుంబం, న్యాయవాది ఇదివరకు ఆరోపించారు. దీంతో సుశాంత్‌ది హత్య, ఆత్మహత్యనా..? అనే విషయాన్ని తేల్చాలని ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్యులను ఏర్పాటుచేశారు. అయితే ఈ వాదనలను వైద్యులు తోసిపుచ్చారు. కొద్దిరోజుల క్రితం సుశాంత్‌ మృతదేహంలో ఎలాంటి విష ప‌దార్ధాలు లేవని, ఆయన మృతికి ఉరి వేసుకోవడమే కారణమని ఐదుగురు ఎయిమ్స్‌ డాక్టర్ల బృందం తెలియ‌జేసింది.  సుశాంత్ పోస్ట్ మార్టం, అటాప్సీ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సుశాంత్‌ది హ‌త్య కాదు, ఆత్మ‌హ‌త్యే అని సీబీఐకి తెలిపింది. ముంబై ఆసుపత్రి నివేదికతో తాము ఏకీభవిస్తున్నట్లు వెల్లడించింది.  Also read : Hathras incident: ఎస్పీ సహా ఐదుగురు పోలీసులపై వేటు


అయితే.. ఇప్పుడు సీబీఐ సుశాంత్ సూసైడ్ కేసు కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించనుంది. ఆత్మహత్యకు సుశాంత్‌ను ఎవరైనా ప్రేరేపించారా అన్న విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. అతి త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా ఈ కేసును విచారించనుంది. మనీలాండరింగ్ కోణంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, కుటుంబ సభ్యులను విచారించనుంది.  Also read: PM Modi inaugurates Atal tunnel: ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం 'అటల్ టన్నెల్' ప్రారంభించిన ప్రధాని మోదీ