PM Modi inaugurates Atal tunnel: ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం 'అటల్ టన్నెల్' ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గమైన అటల్ టన్నెల్‌ను ( World's largest tunnel, Atal tunnel ) ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. 9.02 కి.మీ పొడవైన ఈ సొరంగ మార్గాన్ని హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తాంగ్‌ ( Rohtang in Himachal Pradesh ) వద్ద నిర్మించారు. ఈ సొరంగం ద్వారా మనాలీ నుంచి లఢక్‌లోని లేహ్‌ వరకు కేవలం 7 గంటల వ్యవధిలో చేరుకునే వెసులుబాటు కలిగింది. 

Last Updated : Oct 3, 2020, 08:24 PM IST
PM Modi inaugurates Atal tunnel: ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం 'అటల్ టన్నెల్' ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గమైన అటల్ టన్నెల్‌ను ( World's largest tunnel, Atal tunnel ) ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. 9.02 కి.మీ పొడవైన ఈ సొరంగ మార్గాన్ని హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తాంగ్‌ ( Rohtang in Himachal Pradesh ) వద్ద నిర్మించారు. 2002 మే 26న అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ( Former PM Atal Bihari Vajpayee ) ఈ టన్నెల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా ఆయన మరణానంతరం గత డిసెంబరులో వాజ్‌పేయి 95వ జయంతి సందర్భంగా ఈ సొరంగానికి 'అటల్‌ టన్నెల్‌' ( Atal Tunnel ) అని పేరు పెట్టారు. రూ.3,500 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సొరంగం మనాలి- స్పితి వ్యాలీలను ( Manali to Lahaul-Spiti Valley) అనుసంధానం చేస్తుంది. మనాలి, లేహ్ ప్రాంతాల మధ్య 45 కి.మీ. దూరం తగ్గుతుంది. ఈ సొరంగం ద్వారా మనాలీ నుంచి లఢక్‌లోని లేహ్‌ వరకు కేవలం 7 గంటల వ్యవధిలో చేరుకునే వెసులుబాటు కలిగింది. Also read : Hathras incident: ఎస్పీ సహా ఐదుగురు పోలీసులపై వేటు

Atal tunnel highlights అటల్ టన్నెల్ ప్రత్యేకతలు:
ఆస్ట్రియా టన్నెలింగ్‌ విధానంలో గుర్రపునాడా ఆకారంలో నిర్మించిన ఈ సొరంగంలో ప్రతీ 60 మీటర్లకు ఒక అగ్నిమాపక వ్యవస్థ, ప్రతీ 150 మీటర్లకు ఓ టెలిఫోన్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో ఇబ్బందులు ఎదురవకుండా ప్రతీ 500 మీటర్లకు ఒకచోట ఎమర్జెన్సీ డోర్ నిర్మించారు. సొరంగంలో ప్రయాణించే వారి రక్షణ కోసం ప్రతీ 250 మీటర్లకు ఒకచోట మైకు, సీసీటీవీ కెమెరాలు బిగించారు. అటల్ సొరంగ మార్గం ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi walking in Atal tunnel ) అందులో కొంత దూరం నడిచివెళ్లి సొరంగంలోని ఈ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. Also read : 
Harthras Case: హత్రాస్‌లో పర్యటించనున్న రాహుల్, ఎంపీలు.. యూపీలో హైటెన్షన్

లఢక్‌లో ఉన్న భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం, అత్యవసర సామాగ్రి సరఫరా చేయడానికి ఈ సొరంగం ఎంతగానో ఉపయోగపడుతుంది. 8 మీటర్ల వెడల్పు , 5.525 మీటర్ల ఎత్తుతో నిర్మితమైన ఈ సొరంగం కోసం 14 లక్షల క్యుబిక్‌ మీటర్ల మట్టి, రాళ్లను తవ్వి వెలికితీశారు. ఈ సొరంగ మార్గం కోసం 14,598 టన్నుల ఉక్కు ఉపయోగించారు. Also read : India Covid-19: దేశంలో లక్ష మార్క్ దాటిన కరోనా మరణాలు

అటల్ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ సొరంగ మార్గం నిర్మాణం ద్వారా కలిగే అనేక ప్రయోజనాలను వివరించారు. ఇక్కడి యువతకు అనేక ఉపాధి అవకాశాలను ( Job opportunities ) అందిపుచ్చుకోవడానికి ఈ మార్గం సుగుమం చేస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News