Asaduddin Owaisi: మోహన్ భగవత్ వ్యాఖ్యలపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడ్డారు. ముస్లిం వ్యతిరేక శక్తులకు ప్రభుత్వమే మద్దతు పలుకుతోందని విమర్శలు గుప్పించారు.
Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడ్డారు. ముస్లిం వ్యతిరేక శక్తులకు ప్రభుత్వమే మద్దతు పలుకుతోందని విమర్శలు గుప్పించారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)అధినేత మోహన్ భగవత్ (Mohan Bhagawat) ముస్లింలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ ఘజియాబాద్‌లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఏర్పాటు చేసిన హిందూస్తానీ ఫస్ట్-హిందూస్తాన్ ఫస్ట్ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్నవారు హిందూత్వ వ్యతిరేకులని వ్యాఖ్యానించారు. ఇండియాలో ముస్లిం మత భద్రతకు ప్రమాదం లేదని తెలిపారు. భారతదేశ గడ్డపై హిందూ-ముస్లిం తేడాల్లేవని..భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని మోహన్ భగవత్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఘాటుగా విమర్శలు చేశారు.
ముస్లిం సమాజంపై ద్వేషం..హిందూత్వ నుంచే వచ్చిందని..తీవ్రమైన భావజాలమున్న కొందరి వల్ల వ్యాపిస్తోందని ఒవైసీ తీవ్రంగా ఆరోపించారు. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రచారం చేస్తున్న కొంతమంది నేరస్థులకు హిందూత్వ ప్రభుత్వం మద్దతు పలుకుతోందంటూ ట్విట్టర్ సాక్షిగా విమర్శలు చేశారు. ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న నేరస్థులకు అధికార పార్టీ అండగా ఉంటోందని ఆరోపించారు.
Also read: India Corona Positive Cases: ఇండియాలో భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు, COVID-19 మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook