Majlis Party First List: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్ధుల జాబితాల విడుదలలో పార్టీలు నిమగ్నమయ్యాయి. హైదరాబాద్ పార్టీ మజ్లిస్ తొలి జాబితాను అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి నుంచి జరగనున్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో వివిధ పార్టీలు అభ్యర్ధుల జాబితా రూపకల్పన, విడుదలలో నిమగ్నమయ్యాయి. దేశంలో బీహార్, మహారాష్ట్రలలో ఖాతా తెరిచిన హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మజ్లిస్ పార్టీ (Majlis Party)అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్నికల్లో(Uttar Pradesh Elections) 9 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు. 


ఘజియాబాద్ నుంచి డాక్టర్ మెహతాబ్, హాపూర్‌లోని గర్త్ ముక్తేశ్వర్ నుంచి పుర్కాన్ చౌదరి, హాపూర్లోని మరో నియోజకవర్గం ధౌలోనా నుంచి హాజీ ఆరిఫ్ బరిలో ఉన్నారు. ఇక మీరట్‌లోని సివాల్ ఖాస్ నియోజకవర్గం నుంచి రఫాత్ ఖాన్, సర్దనా నుంచి జీషన్ ఆలం, మీరట్ నుంచి కిథోర్, సహారన్ పూర్ నుంచి అమ్జాద్ అలీ బెహత్, బరేలీ-124 నుంచి షహీన్ రజా ఖాన్, సహారన్ పూర్ దేహత్ నుంచి మర్గూబ్ హసన్ బరిలో ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేసిన తొలి జాబితాలో ఉన్న నియోజకవర్గాలన్నీ ముస్లిం ప్రాబల్యమున్నవే. అటు అభ్యర్ధులు కూడా ముస్లింలే. విజయం ఖాయమనుకున్న స్థానాల్లోనే అభ్యర్ధుల్ని నిలబెట్టాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యుడు మౌలానా నోమానీ..ఒవైసీకు (Asaduddin Owaisi) రాసిన లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. 


Also read: Archana Gautam: నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు.. నేను ఎందుకు రాజకీయాలలోకి వచ్చానంటే: ఎమ్మెల్యే అభ్యర్థి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook