ముంబై (మహారాష్ట్ర): ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీకి చెందిన ఎమ్మెల్యే వారిస్ పఠాన్ 'గణపతి బొప్పా మోరియా' అన్నందుకు క్షమాపణ చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 మహారాష్ట్ర ముంబైకు చెందిన ఏఐఎంఐఎం వారిస్ పటాన్ నేత. ఆయన తాజాగా ముంబైలోని తన నియోజకవర్గంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఓ గణేష్ మండపానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ అందరితో పాటు 'గణపతి బొప్పా మోరియా' అన్నారు. దీంతో అతనిపై మతోన్మాదులు కామెంట్లు చేశారు. పార్టీ అధినాయకత్వం కూడా దీనిపై సీరియస్ అయినట్లు.. అందువల్ల ఆయన క్షమాపణ చెప్పినట్లు నివేదికలు తెలిపాయి.


ఈ ఘటనపై స్పందించిన వారిస్ పఠాన్ క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు. 'నేను నా తప్పును అంగీకరించాను. మరోసారి తప్పు చేయను. నేనూ మనిషినే. మనుషులు తప్పులు చేయడం సహజం. చేసిన తప్పుకు చింతిస్తున్నాను. అల్లాహ్ నన్ను క్షమిస్తాడని భావిస్తున్నా. మీరు కూడా క్షమించాలని కోరుతున్నా..' అని అన్నారు.