Urine and Defecation in Flight: విమానంలో ఇటీవల మూత్ర విసర్జన ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మల, మూత్ర విసర్జన చేసిన సంఘటన కలకలం రేపుతోంది. ముంబై నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరగడంతో నిందితుడిని ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. జూన్ 24న AIC 866 విమానంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫ్లైట్ కెప్టెన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని రామ్ సింగ్‌గా గుర్తించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్రికాలో వంట మనిషిగా పనిచేస్తున్న రామ్‌ సింగ్.. ఎయిర్ ఇండియా విమానం AIC 866 నుంచి ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తూ సీట్ నంబర్ 17F లో కూర్చున్నాడు. మొదట 9 DEF సీటుపై ఉమ్మివేశాడు. అనంతరం మూత్ర, మల విసర్జన చేశాడు. రామ్‌సింగ్‌ను ఎయిర్ ఇండియా సిబ్బంది హెచ్చరించినా.. అతను అలానే ప్రవర్తించాడు. దీంతో వారు విమాన కెప్టెన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఢిల్లీ ఎయిర్‌ లైన్స్ పోలీసులకు కెప్టెన్ ముందుగానే సమాచారం అందించాడు. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే.. భద్రత సిబ్బంది నిందితుడిని పట్టుకోవాలని కోరాడు. రామ్‌సింగ్ ప్రవర్తనపై విమానం తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. క్యాబిన్ సిబ్బంది శాంతింపజేశారు. నిందితుడిని పోలీసులకు అప్పగిస్తామని అందరికీ చెప్పారు. 


నిందితుడిపై సెక్షన్ 294/510 కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కోర్టులో హాజరుపరచగా.. బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. కాగా.. గతేడాది ఎయిర్ ఇండియా విమానంలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి ఓ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. గతేడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తుండగా.. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న శంకర్ మిశ్రా 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన సంచలనం సృష్టించింది. తరువాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


Also Read: Nalugella Narakam Campaign: నాలుగేళ్ల నరకం.. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే లక్ష్యంగా టీడీపీ కొత్త ప్రయత్నం


Also Read: World Cup 2023 Schedule: వరల్డ్‌ ఫైనల్, సెమీ ఫైనల్స్ వేదికలు ఫిక్స్..! ఎక్కడంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook