న్యూఢిల్లీ: lockdown కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను స్వదేశానికి తెచ్చేందుకు కేంద్రం వందే భారత్‌ మిషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. భారత్‌ నుండి ప్రత్యేకంగా విమానాలు ద్వారా విదేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది. అయితే ఇందులో భాగంగా శనివారం ఢిల్లీ నుండి రష్యా రాజధాని మాస్కో బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానాన్ని మార్గమధ్యలోనే ఆగిపోయింది. కాగా విమానంలోని పైలట్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో విమానయాన సంస్థ‌ సిబ్బంది గుర్తించారని ఎయిర్‌ఇండియా సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: జగన్ అనే నేను..!!


కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఏ320 విమానం ప్రయాణికులెవరూ లేకుండానే మాస్కో బయలుదేరింది. ఇదే అంశంపై విమానయాన సంస్థ సీనియర్ అధికారి పేర్కొంటూ.. ఉజ్బెకిస్థాన్‌ గగనతలంలోకి చేరుకునే సమయానికి పైలట్లలో ఒకరికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా ఉన్నట్లు మా సిబ్బంది గుర్తించారని, వెంటనే వెనక్కి రావాలని ఆదేశించామన్నారు. విమానం శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీకి తిరిగొచ్చిందని, విమానంలో ఉన్న సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచామన్నారు. మరోవైపు రష్యాలో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపిస్తామని ఆయన వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..