Flight Charges: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణం ఇక మరింత భారం
Flight Charges: విమాన ప్రయాణీకులకు ఇది బ్యాడ్‌న్యూస్. ఏప్రిల్ 1 నుంచి విమాన ఛార్జీలు మరింత ప్రియం కానున్నాయి. అదే సమయంలో కొన్ని మినహాయింపుల్ని కూడా ఇచ్చింది సివిల్ ఏవియేషన్ శాఖ.
Flight Charges: విమాన ప్రయాణీకులకు ఇది బ్యాడ్‌న్యూస్. ఏప్రిల్ 1 నుంచి విమాన ఛార్జీలు మరింత ప్రియం కానున్నాయి. అదే సమయంలో కొన్ని మినహాయింపుల్ని కూడా ఇచ్చింది సివిల్ ఏవియేషన్ శాఖ.
డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ ఛార్జెస్(Air charges)మరోసారి పెరగనున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు చెల్లించే ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(Aviation Security fees)పెరగడంతో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి విమాన ఛార్జీలు పెరగనున్నాయి. జెట్ ఇంధన ధరలు పెరగడంతో గత రెండు నెలల్లో ఇప్పటికే 30 శాతం ఛార్జీలు పెరిగాయి. ఇప్పుడు మరోసారి పెరగనుండటంతో విమాన ప్రయాణం ఇంకా భారంగా మారనుంది. ఏఎస్ఎఫ్ ఫీజు దేశీయ ప్రయాణీకులకైతే 160 రూపాయల్నించి 2 వందలకు, అంతర్జాతీయ ప్రయాణీకులకైతే 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరిగింది.
ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)జారీ చేసిన ఉత్తర్వుల్లో వివిధ వర్గాలకు చెందిన కొద్దిమంది ప్రయాణీకులకు ఫీజు మినహాయింపు ఉంది. ఇందులో 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు, వైమానిక సిబ్బంది, ఒకే టికెట్‌పై కనెక్టింగ్ ఫ్లైట్ ప్రయాణీకులకు మాత్రం ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 (Covid19)మళ్లీ విజృంభిస్తున్న నేపధ్యంలో ఇప్పటికే షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 31 వరకూ పొడిగిస్తన్నట్టు డీజీసీఏ తెలిపింది. కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదు.
Also read: Fuel Prices: పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం ఇప్పట్లో పడదని తేల్చిన కేంద్ర ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook