అప్పటివరకు విమానాలు, రైల్వే, మెట్రో సేవలు రద్దు
కరోనా వైరస్ వ్యాప్తించకుండా నివారించడం కోసం కేంద్రం మరోసారి లాక్‌డౌన్‌ని మే 17వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మూడోసారి లాక్‌డౌన్‌ని పొడిగిస్తూ నేడు ఆదేశాలు జారీచేసిన కేంద్ర హోంశాఖ.. మే 17వ తేదీ వరకు అందుబాటులో ఉండే సేవల వివరాలు వెల్లడిస్తూ పలు మార్గదర్శకాలు సైతం జారీచేసింది.
న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తించకుండా నివారించడం కోసం కేంద్రం మరోసారి లాక్‌డౌన్‌ని మే 17వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మూడోసారి లాక్‌డౌన్‌ని పొడిగిస్తూ నేడు ఆదేశాలు జారీచేసిన కేంద్ర హోంశాఖ.. మే 17వ తేదీ వరకు అందుబాటులో ఉండే సేవల వివరాలు వెల్లడిస్తూ పలు మార్గదర్శకాలు సైతం జారీచేసింది. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం జాతీయం, అంతర్జాతీయం, అంతర్రాష్ట్ర స్థాయిలో విమానాలు, రైళ్లు, బస్సుల రాకపోకలపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలు యధాతధంగా కొనసాగుతాయి. ఇంకా చెప్పాలంటే, మే 17న లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఎటువంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టంచేసింది. కేంద్ర హోంశాఖ అనుమతి ఉన్న వారికి తప్ప ఇంకెవ్వరికీ ప్రయాణాలు చేసే అవకాశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది.
Also read: Breaking: మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్రం
ఇదిలావుండగానే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సైతం ఓ ప్రయాణికులకు ఓ ప్రకటన విడుదల చేసింది. మే 17వ తేదీన రాత్రి 11.59 గంటల వరకు ఢిల్లీ ఎయిర్ పోర్టు కేంద్రంగా విమానాల రాకపోకలు, అలాగే ప్రయాణాలు ఉండబోవని విమానాశ్రయం అధికారవర్గాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రయాణికులకు ఏమైనా సందేహాలు ఉండి ఉంటే.. సంబంధిత ఎయిర్ లైన్స్ సంస్థలను సంప్రదించాల్సిందిగా ఎయిర్‌పోర్టు మేనేజ్‌మెంట్ తేల్చిచెప్పింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..