Gold Smuggling: తిరుచ్చి, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లలో భారీగా బంగారం పట్టివేత
Gold Smuggling: దక్షిణాది విమానాశ్రయాలు అక్రమ బంగారం రవాణాకు వేదికలవుతున్నాయి. ఇప్పుడు తిరుచ్చి, చెన్నై విమానాశ్రయాల్లో పెద్దఎత్తున బంగారం పట్టుబడింది.
Gold Smuggling: దక్షిణాది విమానాశ్రయాలు అక్రమ బంగారం రవాణాకు వేదికలవుతున్నాయి. ఇప్పుడు తిరుచ్చి, చెన్నై విమానాశ్రయాల్లో పెద్దఎత్తున బంగారం పట్టుబడింది.
దక్షిణాదిన ఉన్న తిరువనంతపురం, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుచ్చి విమానాశ్రయాల్లో తరచూ అక్రమ బంగారం(Gold Smuggling) పట్టుబడుతున్న విషయం తెలిసిందే. సౌదీ దేశాల్నించి ఈ విమానాశ్రయాల ద్వారా పెద్దఎత్తున బంగారం స్మగ్లింగ్ అవుతోంది. ఇప్పుడు మరోసారి తిరుచ్చి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి తిరుచ్చికి వచ్చిన ప్రత్యేక విమానంలో ప్రయాణీకుల్నించి 4.25 కోట్ల విలువైన 8.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. అటు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో(Chennai Airport) 19.75 లక్షల విలువైన 465 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు.
దుబాయ్ నుంచి తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ (Trichy Airport) కు ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల్లో వచ్చిన ప్రయాణీకుల్ని కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఓ మహిళ వద్ద 8.5 కిలోల బంగారం పట్టుబడింది. ఇటీవలి కాలంలో పట్టుబడిన బంగారంలో ఇదే చాలా ఎక్కువని అధికారులు చెబుతున్నారు.
Also read: Delta Plus Variant: భయపెడుతున్న డెల్టా ప్లస్ వేరియంట్, మధ్యప్రదేశ్‌లో మహిళ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook