Delta Plus Variant: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిందని రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. వైరస్ రూపం మార్చుకుని మరింత శక్తివంతంగా మారింది. డెల్టా ప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. ఇండియాలో తొలి మరణం నమోదైంది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి తగ్గుముఖం పట్టినా..డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు భయపెడుతోంది. కరోనా సెకండ్ వేవ్‌లో మరణాలకు కారణమైన డెల్టా వేరియంట్ (Delta Variant)ఇప్పుడు రూపాంతరం చెంది డెల్టా ప్లస్ వేరియంట్‌గా మారింది. ఇది ఇప్పటి వరకూ ఉన్నవాటి కంటే చాలా రెట్లు ప్రమాదకరమని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ(Dr Anthony Fauci) ఇప్పటికే హెచ్చరించారు. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ప్రస్తుతం 28 వరకూ ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖే స్పష్టం చేసింది.
మధ్యప్రదేశ్‌లో మొత్తం 5 డెల్టా ప్లస్ వేరియంట్(Delta Plus Variant)కేసులు నమోదయ్యాయి.ఇందులో 3 భోపాల్ నుంచి అయితే..రెండు కేసులు ఉజ్జయినిలోనివి.ఈ ఐదుగురిలో వ్యాక్సిన్ వేయించుకున్న నలుగురు డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి కోలుకున్నారు. వ్సాక్సిన్ (Vaccine) తీసుకోని మహిళ మాత్రం మృతి చెందింది. మృతురాలి నుంచి తీసుకున్న నమూనా జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా డెల్టా ప్లస్ వేరియంట్‌తోనే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. డెల్టా ప్లస్ వేరియంట్ ప్రాణాంతకం, భయంకరమైనదైనా సరే..వ్యాక్సిన్ తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. అటు మహారాష్ట్రలో ఇప్పటికే 21 డెల్టా ప్లస్ వేరియంట్ (Delta plus variant) కేసులున్నాయి. వైరస్ రూపాంతరం చెంది అత్యంత శక్తివంతంగా మారడంతో ఆందోళన ఎక్కువవుతోంది.
Also read: Corona Positive Cases: ఇండియాలో వరుసగా రెండోరోజు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, సడలింపుల ఎఫెక్ట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook