ముంబై: మహారాష్ట్రలో(Maharashtra politics) కాంగ్రెస్ పార్టీ, శివసేనలకు షాక్ ఇస్తూ ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) మద్దతుతో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేవంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis as CM) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా... డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ భగత్‌ సింగ్‌ కోశ్యారీ(Bhagath Singh Koshyari) వారి చేత ప్రమాణం చేయించారు. అయితే, ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని భావిస్తున్న తరుణంలో అజిత్ పవార్ తీసుకున్న ఈ నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. Read also : మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్.. సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయమై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందిస్తూ.. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమే తాము బీజేపీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని, భారీవర్షాల వల్ల పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులు కష్టాల్లో ఉన్నారని.. వారిని ఆదుకునేందుకే తాము బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.