Akasa Air: దేశంలో విమాన సేవలు అందించేందుకు మరో కొత్త సంస్థ ముందుకు వచ్చింది. ప్రముఖ స్టాక్ మార్కెట్ మదుపరి, వ్యాపార వేత్త రాకేష్‌ ఝన్ ఝన్‌వాలా అండతో ఆకాశ ఎయిర్‌(Akasa Air) రాబోతోంది. వచ్చే నెల 7 నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య తన తొలి సర్వీసును నడపనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈమేరకు ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య సేవలు ప్రారంభంకానున్నాయి. ఈసర్వీసులకు ముందే బుకింగ్ చేసుకోవచ్చని ఆకాశ ఎయిర్‌ తెలిపింది. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో కార్యలాపాలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఓ విమానం భారత్‌కు తరలించారు. మరో విమానం ఈనెలాఖరుకు రానుంది. 


దశల వారిగా ఇతర నగరాలకు తమ కార్యకలాపాలను పెంచుతామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రవీణ్‌ అయ్యర్ వెల్లడించారు. ఈఏడాదిలో ప్రతి నెలా తమ కంపెనీకి రెండు కొత్త విమానాలు అందుతాయని తెలిపింది. ఈమేరకు బోయింగ్‌తో కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఈనెల 7న డీజీసీఏ(DGCA) నుంచి ఆకాశ ఎయిర్‌కు సంబంధించిన ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్(AOC) రానుంది. 


Also read:Komatireddy Brothers:తమ్ముుడు జంప్.. మరి అన్న దారెటు! మూడేళ్లుగా బీజేపీతో  కోమటిరెడ్డి బిజినెస్ డీల్స్?   


Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.