Akhilesh Yadav Climbs JPNIC Boundary Wall: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గోడదూకి వెళ్లిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అక్టోబర్ 11న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు జై ప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు వెళ్లిన అఖిలేష్ యాదవ్ కి యూపీ పోలీసులు భద్రతా కారణాలరీత్యా అనుమతి నిరాకరించారు. దీంతో అక్కడ పోలీసులు, అఖిలేష్ యాదవ్ మద్దతుదారులు మధ్య వాగ్వీవాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే జై ప్రకాశ్ నారాయణ్ స్మారక స్థూపం నిర్మించిన ప్రదేశంలో జై ప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రహరి గోడను అఖిలేష్ యాదవ్ మద్దతుదారులు దాటి వెళ్లేందుకు యత్నించారు. అదే సమయంలో అఖిలేష్ యాదవ్ జై ప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ గోడదూకి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విచిత్రం ఏంటంటే.. జై ప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ ని అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో 2016 అక్టోబర్ 11న ప్రారంభించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన స్మారక స్థూపం భవనంలోకి తనకే అనుమతి నిరాకరించడం ఏంటంటూ అఖిలేష్ యాదవ్ పోలీసులతో వాగ్వీవాదానికి దిగారు. ఈ ఘటనపై ఎక్స్ ద్వారా స్పందించిన అఖిలేష్ యాదవ్.. అవినీతి, నిరుద్యోగ సమస్య, ఆర్థిక మాంధ్యం వంటి సమస్యలపై జై ప్రకాశ్ నారాయణ్ పోరాటం చేశారని.. ప్రస్తుతం బీజేపి హయాంలో మళ్లీ ఆ సమస్యలన్నీ ఎన్నో రెట్లు అధికమయ్యాయి కనుకే జై ప్రకాశ్ నారాయణ్ దిశానిర్దేశం చేసిన సిద్ధాంతాలను చూసి బీజేపి భయపడుతోందన్నారు. జై ప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతాలను అడ్డుకునేందుకే బీజేపి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతోంది అని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. 


జై ప్రకాశ్ నారాయణ్ స్మారక స్థూపానికి పూలమాల వేసి నివాళి అర్పించాలంటే మళ్లీ ఉద్యమాలకు పిలుపునివ్వాలనేదే బీజేపి నిర్ణయమైతే.. అందుకు తాము సైతం సిద్ధమేనని అఖిలేశ్ యాదవ్ అభిప్రాయపడ్డారు.  



ఇది కూడా చదవండి : Rajasthan Assembly Elections: రాజస్థాన్‌ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు.. కారణం ఇదే..!


జై ప్రకాశ్ నారాయణ్ స్మారక స్థూపం జై ప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ నిర్మాణం విషయంలో ఒకసారి గతంలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. మరో రెండు ప్రాజెక్టుల నిర్మాణాలకు సైతం అఖిలేశ్ యాదవ్ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2017 లో బీజేపి అధికారంలోకి వచ్చిన తరువాత జై ప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ నిర్మాణంతో పాటు అప్పటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పర్యవేక్షించిన మరో రెండు ప్రాజెక్టులను ప్రత్యేకంగా ఆడిట్ చేయించాల్సిందిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయానికి సిఫార్సులు సైతం అందిన విషయం తెలిసిందే.


ఇది కూడా చదవండి : When Children Have Children: బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం.. 'వెన్ చిల్డ్రన్ హావ్ చిల్డ్రన్' బుక్ ఆవిష్కరణ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి