When Children Have Children: బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం.. 'వెన్ చిల్డ్రన్ హావ్ చిల్డ్రన్' బుక్ ఆవిష్కరణ

Child Marriage Free India: భారత దేశంలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా రయిచత భువన్ రిభు 'వెన్ చిల్డ్రన్ హావ్ చిల్డ్రన్' పుస్తకాన్ని రూపొందించారు. తాజాగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 2030 నాటికి బాల్య వివాహ రహిత భారత్‌కు ఈ బుక్ బ్లూ ప్రింట్‌గా సిద్ధం చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2023, 05:02 PM IST
When Children Have Children: బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం.. 'వెన్ చిల్డ్రన్ హావ్ చిల్డ్రన్' బుక్ ఆవిష్కరణ

Child Marriage Free India: అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని (అక్టోబర్ 11) 'వెన్ చిల్డ్రన్ హావ్ చిల్డ్రన్: టిప్పింగ్ పాయింట్ టు ఎండ్ చైల్డ్ మ్యారేజ్' పేరుతో శ్రీ భువన్ రిభు రచించిన పుస్తకం, తెలంగాణాలోని 8 జిల్లాల్లో ఏకకాలంలో ఆవిష్కరించారు. ప్రస్తుతం దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. బాల్య వివాహాలపై ఇంకా చాలా మందికి అవగాహన కలగడం లేదు. అయితే 2030 నాటికి భారతదేశాన్ని బాల్య వివాహ రహితంగా ఎలా మార్చాలనే బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బాల్య వివాహ రహిత భారత్ ప్రచారంలో భాగంగా ఈ పుస్తకం ఆవిష్కరించారు.

ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త, మహిళలు, పిల్లల రక్షణ కోసం పనిచేస్తున్న రచయిత భువన్ రిభు ఈ పుస్తకాన్ని రూపొందించారు. దేశంలో బాలల హక్కుల పరిరక్షణ, రక్షణ కోసం పనిచేస్తున్న 160 సంస్థలకు సలహాదారుగా ఉన్నారు. ఈ పుస్తకం భారతదేశం నుంచి బాల్య వివాహాలను నిర్మూలించడానికి ఆలోచనలు, ఫ్రేమ్‌వర్క్, కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. 300 కంటే ఎక్కువ బాల్య వివాహాల ప్రాబల్యం ఉన్న జిల్లాలలో పౌర సమాజ సంస్థలు, మహిళా కార్యకర్తలు నేతృత్వంలోని బాల్య వివాహ రహిత భారత ప్రచారంలో ఇది ఒక కీలక మైలురాయి. బాల్య వివాహాల నుంచి బయటపడినవారు, చట్ట అమలు సంస్థలు, పౌర సమాజ సంస్థల ప్రముఖులు ఈ పుస్తకాన్ని లాంఛనంగా విడుదల చేశారు.

బాల్య వివాహాలను 2006 నుంచి 50 శాతం నుంచి 23.3 శాతానికి తగ్గించడం ద్వారా భారతదేశం బలమైన పురోగతిని సాధించింది. అయినా ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. యూనిసెఫ్ అంచనాల ప్రకారం.. ప్రస్తుత స్థాయిలోనే బాల్య వివాహాలు కొనసాగితే.. 2050 వరకు భారతదేశం అంతటా కనీసం లక్షలాది మంది బాలికలు బాల్య వివాహాలకు బలి అవుతారని పేర్కొంది. జాతీయ బాల్య వివాహాల ప్రాబల్యం స్థాయిలను 2030 నాటికి 5.5 శాతానికి తగ్గించడం సాధ్యమవుతుందని ఈ పుస్తకం అభిప్రాయ పడింది. 

"నాకు 15 ఏళ్లు. 10వ తరగతి చదువుతున్నప్పుడే పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక ఒక సంవత్సరంలోనే నేను మాతృత్వం బాధ్యతతో పోరాడాను. ముందుగానే గర్భం దాల్చడం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభమైంది. గృహ హింసకు కూడా గురయ్యాను. తిరిగి నా చదువును పునఃప్రారంభించే ధైర్యాన్ని తెచ్చుకోవడానికి దశాబ్దం పైగా పట్టింది. నేను ఈ రోజు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నాను. నా ఆడపిల్లలను లేదా నా చుట్టూ ఉన్న పిల్లలను బాల్య వివాహాల అఘాయిత్యాలను ఎదుర్కోనివ్వనని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.." అని 35 సంవత్సరాల హర్యానాకు చెందిన రుచి (పేరు మార్చాం..) అనే ఒక యన్‌జివో కౌన్సిలర్ తెలిపారు.

పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ కంట్రీ హెడ్ రవికాంత్ మాట్లాడుతూ.. బాల్య వివాహ రహిత భారతదేశం కోసం పౌర సమాజంతో పాటు ప్రభుత్వాలు రెండూ తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. తాము రెండు అంశాలపై పని చేస్తున్నామని.. మొదటిది అవగాహన కల్పించడం. రెండవ ముఖ్యమైన అంశం ప్రస్తుత చట్టాలు, విధానాల అమలు. ఈ పుస్తకం 2030 నాటికి భారతదేశాన్ని బాల్య వివాహ రహితంగా మార్చడానికి ఒక బ్లూప్రింట్ లాంటిదని చెప్పారు.  

జనాభా లెక్కల 2011 నివేదిక ప్రకారం.. భారతదేశంలో 51,57,863 మంది బాలికలు ఉండగా.. తెలంగాణలో 18 ఏళ్లు నిండకుండానే దాదాపు 2.8 లక్షల మంది పిల్లలకు వివాహాలు జరిగాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. బాల్య వివాహాల చెడు నుంచి యువతులను రక్షించడానికి తక్షణ చర్యలు అవసరం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-V (NFHS 2019-21) నివేదిక ప్రకారం జాతీయంగా 20-24 ఏళ్ల మధ్య వయసున్న 23.3% మంది మహిళలు 18 ఏళ్లు నిండకముందే పెళ్లి చేసుకున్నారు. తెలంగాణలో 23.5% మంది మహిళలు అదే వయస్సులో ఉన్నట్లు నివేదించారు.

Also Read: IND Vs AFG Dream11 Prediction Today Match: ఆఫ్ఘన్‌తో భారత్ పోరు.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..  

Also Read: Jio Best Recharge Plan: ఇది కదా కావాల్సింది.. బెస్ట్ జియో రీఛార్జ్ ప్లాన్ ఇదే.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News