Arvind Kejriwal: కేజ్రీవాల్ పై కొత్త ఆరోపణలు.. లైంగిక వేధింపుల ఘటనలో బాధితులకు అన్యాయం..
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని ట్విస్టులు ఎదురౌతున్నాయి. ఇప్పటికే ఆయన జైలునుంచి పాలన పరమైన అనేక ఆదేశాలను జారీ చేస్తున్నారు. మరోవైపు ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన లైంగిక వేధింపుల ఘటనలో చర్యలు తీసుకొవడంలో తాత్సరం చేశారంటూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi LG VK Saxena Allegation Against Arvind Kejriwal: దేశంలో ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఘటనతీవ్ర దుమారం రెకెత్తిస్తుంది. ఒకవైపు కేంద్రం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు ఈడీ కూడా తన దూకుడు పెంచింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ లో అరవింత్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడంను ఆప్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దర్యాప్తు సంస్థలు, ఈడీ అధికారులను అడ్డంపెట్టుకుని అపోసిషన్ లీడర్ల గొంతునొక్కె ప్రయత్నాలు చేస్తుంంటూ మండిపడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకె సక్సెనా చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి.
Read More: Snake Attack: పాముతో లిప్ లాక్ కోసం ట్రైచేశాడు.. ట్విస్ట్ మాములుగా లేదుగా..అసలేం జరిగిందంటే..?
జైలు నుంచి పాలన సాగించడం సబబు కాదని, ఢిల్లీలో రాష్గ్రపతి పాలన విధించాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లైంగిక వేధింపులు ఘటనకు సంబంధించిన కేసులో చర్యలు తీసుకొవడంలో సరైన విధంగా స్పందించలేదని కూడా తాజాగా, ఢిల్లీ లెఫ్టె నెంట్ గవర్నర్ సక్సెనా కీలక వ్యాఖ్యలు చేశారు.
అంబేద్కర్ మెడికల్ కాలేజీలో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలో కళాశాల ప్రిన్స్ పాల్ పై చర్యలు తీసుకునేందుకు ఫైల్ ను కేజ్రీవాల్ దగ్గర పంపించారు. కానీ ఆయన దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాదాపు 45 రోజుల పాటు తనవద్దనే ఉంచుకున్నారు. తాజాగా లిక్కర్ కేసులో ఈడీ రిమాండ్ లో కేజ్రీవాల్ ఉండగా, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 14 ఈ సిఫారసు కేజ్రీవాల్ దగ్గరకు వచ్చిందని కానీ , దీనిపై చర్యలు తీసుకోలేదని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ సక్సెనా ఆరోపణలు చేశారు.
మార్చి 20న ఢిల్లీ లెప్టె నెంట్ గవర్నర్ కు రాసిన నోట్‌లో.. సౌరభ్ భరద్వాజ్ బాధితులకు సహకరించడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు . ఈ ఘటనపై ప్రస్తుతం తీవ్రదుమారం చెలరేగింది. దీనిపై ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకె సక్సేనా కీలక ఆదేశాలు జారీచేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని, బాధ్యులపై క్రిమినల్ ప్రొసిడింగ్ లను వేగవంతం చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.
Read More: Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..
అదే విధంగా.. ఈ కేసులో క్రమశిక్షణా చర్యలను వేగవంతం చేయాలని ప్రధాన కార్యదర్శిని కూడా ప్రత్యేంగా ఢిలీ ఎల్జీ సక్సనా ఆదేశించారు.
కాగా, జనవరి 31వ తేదీన మెడికల్ కాలేజీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి వారిని అనుచితంగా తాకేందుకు ప్రయత్నించారు.
బాధిత విద్యార్థులు ఫిబ్రవరి 1న ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి)కి కూడా రిఫర్ చేశారు. కానీ రోజులు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రిన్సిపాల్, ఇతర ఆసుపత్రి అధికారులు చర్యలు తీసుకోకుండా, వారి ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. విద్యార్థులు పోలీసులను ఆశ్రయించగా ఫిబ్రవరి 22న ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook