Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..

Viral Video:మణికర్ణిక ఘాట్ లో ఇద్దరు దంపతులు వారణాసిలో స్వామివారిని దర్శించుకొవడానికి వచ్చారు. హోలీ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 28, 2024, 03:01 PM IST
  • మణికర్ణిక ఘాట్ లో దారుణఘటన..
  • దంపతులపై రంగులు వేస్తూ పైశాచికం..
Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..

Goons Are Throws Water On Couple At Manikarnika Ghat: దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు సంబరంగా జరుపుకున్నారు. కొందరు నేచురల్ రంగులతో హోలీ వేడుకలు జరుపుకుంటే,మరికొందరు మాత్రం కెమికల్స్ తో వేడుకలు జరుపుకున్నారు. హోలీలో చిన్నా, పెద్దా తేడాలేకుండా సంబరాలు జరుపుకున్నారు. హోలీని ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ ఆచారంను పాటిస్తుంటారు. కొందరు హోలీ రోజున అబ్బాయిలు అమ్మాయిల మాదిరిగా వేషం వేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. మరికొందరు హోలీరోజున.. పెళ్లికానీ వారు ఉట్టికొడుతుంటూ, అమ్మాయిలు రంగునీళ్లను పొస్తుంటారు. అదే విధంగా..మరికొన్ని చోట్ల కొత్త అల్లుళ్లను,గాడిదల మీద ఊరేగిస్తుంటారు.

 

 

ఇక కొన్ని చోట్ల హోలీరోజున.. పిడిగుద్దులు కొట్టుకుంటారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ఆచారంను బట్టి హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఇదిలా ఉండగా.. హోలీరోజున గుడ్లు పగులకొట్టుకుంటారు. టమాటాలను పగుల కొట్టుకోవడం మనకు తెలిసిందే. రంగులు చల్లుకొవడం నేపథ్యంలో కొన్నిసార్లు అనుకోని  ఘటనలు కూడా జరుగుతుంటాయి. హోలీ పండుగ రోజు ప్రముఖ దేవాలయం వారణాసిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. 

హోలీవేడుక రోజున ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో షాకింగ్ ఘటన జరిగింది. ఇద్దరు దంపతులు మణికర్ణిక ఘాట్ ను సందర్శించడానికి వచ్చారు. అక్కడ కొందరు ఆకతాయిలు ఒకరిపై మరోకరు రంగులు వేసుకుంటున్నారు. అప్పుడు ఆకతాయిలు ఈజంటను చూడగానే అతిగాప్రవర్తించారు. దంపతులపై హోలీ రంగులు చల్లుతూ పైశాచీకంగా ప్రవర్తించారు.

Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?

అసలు ఒక మహిళ అని కూడా చూడకుండా, రంగులు వేస్తూ, గట్టిగా అరుస్తు నానారచ్చ చేశారు. మహిళమీద నీళ్లు పొస్తుంటే ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది. ఆమె భర్త వారిస్తున్న కూడా  ఆకతాయిలు మరింతగా రెచ్చిపోయినీళ్లు వేస్తు దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటనను వీడియో కూడా రికార్డు తీశారు. ఇప్పుడి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x